MLA : మాట మీద నిలబడే ప్రభుత్వం మాది
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:45 AM
ప్రతి నెలా ఒకటో తేదీ రాకనే ఇంటి ముందుకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఎమ్మెల్యే మంగళవారం చెన్నేకొత్తపల్లి మండలంలోని హరియనచెరువు గ్రామంలో ఇటింటికి వెళ్లి పింఛనలను పంపిణీ చేశారు. అలాగే రామగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
-ఎమ్మెల్యే పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి/రామగిరి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా ఒకటో తేదీ రాకనే ఇంటి ముందుకు వెళ్లి పింఛన అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మాట ఇస్తే నిలబడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని కొనియాడారు. ఎమ్మెల్యే మంగళవారం చెన్నేకొత్తపల్లి మండలంలోని హరియనచెరువు గ్రామంలో ఇటింటికి వెళ్లి పింఛనలను పంపిణీ చేశారు. అలాగే రామగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఆమె పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు. మాటిస్తే నిలబెట్టుకునే తత్వం చంద్రబాబుదని, సూపర్‌సిక్స్ పథకాల్లో పింఛన్ల పెంపును అమలు చేసి నిరూపించాన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం లాగా కాకుండా పార్టీలకు అతీతంగా అర్హులందరికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అబివృద్దిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు నిరసనల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అయితే ఎవరూ నమ్మేపరిస్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓశివశంకరప్ప, ఈఓఆర్‌డీ అశోక్‌నాయక్, టీడీపీ సీకేపల్లి మండల కన్వీనర్ ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాఽధ్యక్షుడు దండు ఓబుళేశు, జనసేన మండల కన్వీనర్ ఇటికోటి క్రాంతికుమార్, మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర, ప్రధాన కార్యదర్శి ముత్యాలప్ప,రాజు, రైతుసంఘం రామగిరి మండల అధ్యక్షుడు అక్కులప్ప, నాయకులు గొల్ల అక్కులప్ప, గుర్రంశీన, నరసయ్య, క్రాంతి, మనోహర్, అనిల్, సురేశ, నాగరాజు పాల్గొన్నారు.
వరినాట్లు వేసిన ఎమ్మెల్యే
రామగిరి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం మండల కేంద్రమైన రామగిరిలో పింఛన్ల పంపిణీలో భాగంగా వ్యవసాయపొలాల్లోకి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. అక్కడ లబ్దిదారులు వరినాట్లు వేస్తుండటంతో వారికి పింఛన్లు అందించి ఆమె కూడా వరినాట్లు వేశారు. నియోజకవర్గంలో కృష్ణమ్మనీటితో వ్యవసాయ పొలాలు పులకిస్తున్నా యని సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....