MLA : మరువకొమ్మ వద్ద బస్టాప్ ఏర్పాటు చేస్తాం
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:29 AM
నియోజకవర్గ కేంద్రం సమీపం లోని మరవకొమ్మ వద్ద బస్టాప్ ఏర్పాటు చేయిస్తాని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. రోడ్డు పనులు జరిగిప్పటి నుంచి అక్కడ బస్సులు నిలపకపోవడంతో చాలా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం నేషినల్ హైవే అధికారులతో కలసి శింగనమల మరవకొమ్మ వద్ద జరుగుతున్న ఎనహెచ 544డి జాతీయ రహదారుల పనులను పరిశీలించారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
శింగనమల, జనవరి7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రం సమీపం లోని మరవకొమ్మ వద్ద బస్టాప్ ఏర్పాటు చేయిస్తాని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. రోడ్డు పనులు జరిగిప్పటి నుంచి అక్కడ బస్సులు నిలపకపోవడంతో చాలా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం నేషినల్ హైవే అధికారులతో కలసి శింగనమల మరవకొమ్మ వద్ద జరుగుతున్న ఎనహెచ 544డి జాతీయ రహదారుల పనులను పరిశీలించారు. త్వరగా బస్టాప్ (ఓన్లీ పబ్లిక్ ట్రాన్సపోర్ట్) కోసం నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారు లను ఆదేశించారు. అలాగే సి. బండమీదపల్లిలో రోడ్డు కోసం భూములు కో ల్పోయిన వారికి ఇంకా డబ్బులు జమ కాలేదన్నారు. ఎస్‌ఆర్‌ఐటీ వద్ద రూల్ ప్రకారమే రోడ్డు పనులు చేయించాలని అధికారులను సూచించారు. తహసీల్దార్ సాకే బ్రహ్మయ్య, ఏఈ శివకృష్ణ, సీఫ్టెన రాముడు, టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు, డేగల కృష్ణమూర్తి, షాలిని, ఈశ్వర్‌రెడ్డి, కుమ్మెత చండ్రాయుడు, సత్యనారాయణ, అనిల్, మాసూల చంద్ర, అనిల్, సురేష్, చెన్నయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....