Share News

NEW YEAR : నూతన సంవత్సరానికి ఘన స్వాగతం

ABN , Publish Date - Jan 02 , 2025 | 12:37 AM

కోటి ఆశల పల్లకిలో ఊరేగు తూ వచ్చిన 2025 ఆంగ్ల నూతన సంవత్స రా దికి జిల్లా వాసులు బుధవారం ఘనంగా స్వా గతం పలికారు. ప్రతి ఇంటా వేడుకలు అంబ రాన్నంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు క్యూకట్టారు. పుష్పగుచ్ఛాలు, మిఠాయి లు, పండ్లు అందజేసి, కేక్‌ కట్‌ చేసి శుభా కాంక్షలు తెలిపారు.

NEW YEAR : నూతన సంవత్సరానికి ఘన స్వాగతం
Tammineni Pavana wishing Minister Keshav

అనంతపురం కల్చరల్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : కోటి ఆశల పల్లకిలో ఊరేగు తూ వచ్చిన 2025 ఆంగ్ల నూతన సంవత్స రా దికి జిల్లా వాసులు బుధవారం ఘనంగా స్వా గతం పలికారు. ప్రతి ఇంటా వేడుకలు అంబ రాన్నంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు క్యూకట్టారు. పుష్పగుచ్ఛాలు, మిఠాయి లు, పండ్లు అందజేసి, కేక్‌ కట్‌ చేసి శుభా కాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా అంతటా నూతన సంవత్సర సం దడి కొనసాగింది. ప్రజాపిత బ్రహ్మకు మారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీలు ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణిశ్రీ, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరిని కలిసి మిఠాయిలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లోనూ కేక్‌లు కట్‌చేసి నూతన సంవత్సరాన్ని స్వాగతించా రు. జిల్లా వ్యాప్తంగా వివిధ పలు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, విశేష పూజాకార్యక్రమా లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాకేంద్రంలో ఆర్‌ఎఫ్‌ రోడ్డులో ఉన్న లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాలయం, రామచంద్రనగర్‌లోని షిర్డీసాయి ఆలయం, మూడోరోడ్డు సాయినాథమందిరం తదితర ఆలయాల్లో పూజలు నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 02 , 2025 | 12:37 AM