UGADI: భక్తిప్రపత్తులతో ‘విశ్వావసు’కు స్వాగతం
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:31 PM
తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు.

అనంతపురం కల్చరల్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): తెలుగువారి నూతన సంవత్సరాదిని జిల్లా వాసులు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని భక్త్దిప్రపత్తులతో ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజాకార్యక్రమాలు, పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించారు. తెలుగు సాంప్రదాయాన్ని చాటుకునే రీతిలో నూతన వస్త్రాలు ధరించి పండుగ జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సందర్శనలతో కిటకిటలా డాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణాలలో ప్రజలు విరివిగా పాల్గొని, కొత్త సంవత్స రాది ఫలితాలు ఎలా వుండనున్నాయో ఆసక్తిగా ఆలకిం చారు. లలితకళా పరిషతలో సాయంత్రం వేదపండితు డు గరుడాద్రి సురేష్‌శర్మచే పంచాంగ శ్రవణం చేయించారు. అనంతరం పరిషత ఆధ్వర్యంలో పలువురు కళాకారులకు ఉగాది పురస్కారాలు అందజేసి సత్కరించారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
ఆర్‌ఎఫ్ రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, మొదటిరోడ్డు లోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, పాతూరు దత్తాత్రేయ మందిరం, మారుతీనగర్ రామాలయం, రామ్‌నగర్ వెంకటేశ్వరస్వామి దేవాలయం, శారదానగర్‌లోని శివబాలయోగి ఆశ్రమం, శృంగేరి శంకర మఠం, రామ్ నగర్ వెంకటేశ్వరస్వామి దేవాలయం, శివకోటి లలితాశివకామేశ్వరి ఆలయం, హౌసింగ్‌బోర్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. రెవెన్యూ కాలనీ రామాలయంలో టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో వాసు దేవశాసి్త్ర, పాతూరు వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో పురోహితుడు నాగవెంకట కుమారశర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....