Share News

Andhra Pradesh: ఆట మొదలైంది.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ వార్నింగ్..

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:48 PM

‘ఇక గేమ్ స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియా వ్యవహారంలో మీరు చూశారు కదా. మిగతా కేసులు కూడా అలానే డీల్ చేస్తాను. కేడర్ ఉద్దేశ్యం ఒకలాగా ఉంది. నా లక్ష్యం వేరుగా ఉంది. ఎందుకంటే..’

Andhra Pradesh: ఆట మొదలైంది.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ వార్నింగ్..
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సంవత్సరం ప్రారంభంతోనే.. ప్రత్యర్థులకు సరికొత్త వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆట మొదలైందని.. ఎవరినీ వదిలిపెట్టబోనని స్పష్టమైన ప్రకటన చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తాను జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంతమందికి మిసరబుల్ ట్రీట్‌మెంట్ ఉంటుందని అన్నానని గుర్తు చేశారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. అయితే, తాను రాజకీయ కక్ష తీర్చుకోబోనని.. తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.


1995 సీఎంను త్వరలో మీరే చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇక గేమ్ స్టార్ట్ అయ్యింది. సోషల్ మీడియా వ్యవహారంలో మీరు చూశారు కదా. మిగతా కేసులు కూడా అలానే డీల్ చేస్తాను. కేడర్ ఉద్దేశ్యం ఒకలాగా ఉంది. నా లక్ష్యం వేరుగా ఉంది. ఎందుకంటే.. నేను అందరి అభిప్రాయాలు తీసుకోవలి. అవతలి వాళ్లు చేసినట్లు నేను చేయను. చట్టం, న్యాయం ప్రకారం చేస్తాను. నేను ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు.’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘మా కేడర్, నాయకులు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడుతున్నాను. అందరినీ కరెక్ట్ చేస్తాను. అలాగే కలిసి ముందుకు వెళ్తాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేలా ఉండాలి. 2004 లో నన్ను ఎవరూ ఓడించలేరు. హైదరాబాద్‌ను ఎన్నడూ లేని విధంగా డెవలప్ చేశాను. కానీ, ప్రజలకు ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయలేకపోయాను. ఇప్పుడు ప్రజలకు చెప్పి మనం ముందుకు తీసుకెళ్లాలి.’ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.


‘గతంలో మా పార్టీ నేతలను హతమార్చారు. జగన్ హయాంలో మా పార్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. అందరినీ మేము చాలావరకు సర్దుబాటు చేస్తున్నాము. అందరికీ పదవులు ఇవ్వలేం కదా. ఈ సారి జాగ్రత్తగా ఉన్నాము. అందరు అభిప్రాయాలు తీసుకుంటాను. నేను సభ్యత్వం, పదవులు పంపిణీ మీద అన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. నా ఓన్ మెకానిజమ్ నాకు ఉంది. అందుకే ప్రతి విషయం క్రాస్ చేసుకుంటున్నాను. గంతలోలా నేను లేను. అన్ని విషయాలు నేను చూసుకుంటున్నాను.’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ప్రజల నమ్మకాన్ని రీచ్ కావాలి..

దీపం, నాలుగు వేలు పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా. నేను ప్రజలను అభినందిస్తున్నాను. వాళ్లు ఇచ్చే సహకారం నేను మరువను. వాళ్లకు జరిగే దానిపై సంతృప్తి ఉంది. భవిష్యత్‌పై ఆశ ఉంది. వాళ్ల హోప్స్‌కి మేము రీచ్ కావాలి.’ అని ముఖ్యమంత్రి తెలిపారు.


Also Read:

క్యాచ్ ఆఫ్ ది ఇయర్.. చూసి తీరాల్సిందే..

రంగంలోకి సీఎం.. మావోయిస్టులకు గట్టి దెబ్బ

ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 01 , 2025 | 06:48 PM