Share News

Delhi Assembly Elections: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:26 PM

Delhi Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

Delhi Assembly Elections: బీజేపీ విజయం కోసం హస్తినకు చంద్రబాబు.. ఆ నియోజకవర్గాల్లో చక్రం తిప్పనున్న సీఎం
CM Chandrababu Naidu

అమరావతి, జనవరి 28: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయన ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన న్యూఢిల్లీలో తెలుగు వారు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులను మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ సీఎం చంద్రబాబు నాయుడును బీజేపీ అగ్రనాయకత్వం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో దేశ రాజధాని ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టాడనేది ఆ రోజు మధ్యాహ్నానానికి తెలియనుంది.

మరోవైపు గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సైతం సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. దీంతో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సీఎం చంద్రబాబుతో ప్రచారం నిర్వహించాలని భావించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ ఆయనను కోరింది. అదీకాక.. ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన పార్టీలు భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లో తెలుగు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే పలుమార్లు ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుపొందింది. దీంతో ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే గతేడాది ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయనను తీహాడ్ జైలుకు తరలించారు. దాదాపు కొన్ని నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ కోర్టు మంజూరు చేసింది.

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం


దాంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్.. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ క్రమంలో పార్టీలోని సీనియర్ నేత, మంత్రి అతిషిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లర్లు వేసే ఓటు ద్వారా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకొని.. మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్టాస్తానంటూ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఢిల్లీ ఓటరు ఎవరికి పట్టం కట్టేది తెలియాలంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు వేచి ఉండక తప్పదన్నది సుస్పష్టం.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 07:09 PM