CM Chandrababu: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:35 PM
CM Chandrababu: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలని వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా జగన్ గుంటూరు వెళ్లారని గుర్తు చేశారు. ఈసీ ఆదేశాలను కూడా జగన్ పట్టించుకోలేదని చెప్పారు. కోడ్ ఉల్లంఘించి.. జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని చెప్పారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: రైతులను ఆదుకొంటామని.. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఆ క్రమంలో కేంద్రం ఎదుట కొన్ని ప్రతిపాదనలు ఉంచామని చెప్పారు.
ఈ అంశంపై సమీక్ష చేసి.. ఏ విషయం శుక్రవారం చెబుతారని తెలిపారని ఆయన పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని తాము కోరినట్లు తెలిపారు. ఏపీలో 5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అవుతోందని వివరించారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది ధరలు పడిపోయాయన్నారు. డిమాండ్ తగ్గిపోవడంతో రైతులు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని తాము కోరామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అలాగే మిర్చి ఎగుమతులను ప్రోత్సహించాలని కేంద్రానికి విజ్జప్తి చేశామని చెప్పారు. ఇక ధరల స్థిరీకరణ కోసం ఆలోచన చేస్తున్నామన్నారు. అందుకోసం కేంద్ర వాణిజ్య శాఖతో సంప్రదింపులు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం సేకరించాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పని చేస్తున్నామన్నారు. ఇక బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకారం కోరామని చెప్పారు. అందులోభాగంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో తాను చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు జల్‌జీవన్ మిషన్ గురించి సైతం తాను మాట్లాడానన్నారు. గత వైసీపీ ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్‌ను సరిగా ఉపయోగించుకోలేదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విమర్శించారు.
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
గత ప్రభుత్వ విధానాల వల్ల.. జల్‌జీవన్ మిషన్ కింద రూ.27 వేల కోట్లే వస్తోందని.. కానీ ఇంకో రూ.54 వేల కోట్లు కావాల్సి ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఏపీ మిర్చి రైతుల సమస్యలపై ఆయనకు సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో.. రైతులు నష్టపోతున్నారని ఆయనకు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్సిని సీఎం చంద్రబాబు కోరారు.
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయం చేయాలని వైఎస్ జగన్‌కు సీఎం చంద్రబాబు చురకలంటించారు. వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా జగన్ గుంటూరు వెళ్లారని గుర్తు చేశారు. ఈసీ ఆదేశాలను కూడా జగన్ పట్టించుకోలేదని చెప్పారు. కోడ్ ఉల్లంఘించి.. జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని చెప్పారు. కోడ్ ఉన్నందున రావడానికి వీల్లేదని పోలీసులు సైతం ఆయనకు తెలిపారన్నారు. రావొద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి.. తనకు భద్రత కల్పించ లేదని వైఎస్ జగన్ అంటున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికల సంఘం కంటే.. వైఎస్ జగన్ గొప్పవారు కాదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News