AP High Court : అవినాష్‌రెడ్డి పీఏ బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - Jan 08 , 2025 | 03:43 AM
కడప వైసీపీ ఎంపీ అవినా్‌షరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
10న విచారణకు రావాలని రాఘవరెడ్డికి పోలీసుల నోటీసులు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసు..
అమరావతి/పులివెందుల టౌన్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): కడప వైసీపీ ఎంపీ అవినా్‌షరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మంగళవారం కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కె కృపాసాగర్ ఉత్తర్వులు జారీచేశారు. కడప జిల్లా పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాఘవరెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రాఘవరెడ్డిని మంగళవారం మధ్యాహ్నం పోలీసులు పులివెందులపోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. 41ఏ నోటీసులు ఇచ్చి, 10న విచారణకు రావాలని చెప్పి పంపించేశారు.