Share News

AP State Govt : ‘కేబినెట్‌ హోదా’కు జీతాల పెంపు

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:01 AM

రాష్ట్రంలో కేబినెట్‌ హోదా కలిగిన వారి జీతాలు, అలవెన్సులను ప్రభుత్వం పెంచింది.

AP State Govt :  ‘కేబినెట్‌ హోదా’కు జీతాల పెంపు

  • జీతం, అలవెన్సుల కింద రూ.4.50 లక్షలు

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేబినెట్‌ హోదా కలిగిన వారి జీతాలు, అలవెన్సులను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం వారి జీతాలు, అలవెన్సులు కలిపి రూ.1.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కేబినెట్‌ హోదా కలిగిన వ్యక్తులకు రూ.2 లక్షల వరకూ జీతం చెల్లించనుంది. ఇవి కాకుండా పీఏ, పీఎస్‌, ఓఎస్‌, డ్రైవర్‌ జీతాల కింద రూ.70 వేలు, వాహన అలవెన్సుల కింద రూ.60 వేలు, మొబైల్‌ ఫోన్‌ డేటా కనెక్షన్‌ నిమిత్తం రూ.500, ప్రయాణాల నిమిత్తం ఇంటర్నేషనల్‌ అయితే బిజినెస్‌ క్లాస్‌, దేశీయంగా విమానాలు, రైలులో తిరిగేందుకు అలవెన్సులతో కలిపి రూ.4.50 లక్షల వరకూ ప్రభుత్వం వారికి చెల్లించనుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 12 , 2025 | 05:01 AM