Home » AP Cabinet Meet
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్‌కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. అసెంబ్లీలో
కూటమి సర్కారు తన తొట్టతొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఆర్థిక సంవత్సరం మొదలైన ఎనిమిది నెలల తర్వాత... మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలిఉండగా రూ.2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్‌కే పరిమితం కాగా...
విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినేట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేసే అవకాశముంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.
‘మంత్రులందరూ నాతో పోటీ పడాలి.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇన్చార్జి మంత్రులు, స్థానిక మంత్రులు తక్షణమే స్పందించాలి. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం
విశాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వం జరిపిన భూకేటాయింపులను రద్దుచేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సంబంధిత జీవోలను రద్దుచేయాలని తీర్మానించింది. అలాగే మహిళలకు దీపావళి కానుక ప్రకటించింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని
Andhrapradesh: వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై ఏపీ కేబినెట్లో చర్చకు వచ్చింది. గతేడాది ఆగస్టులోనే వలంటీర్ల కాలపరిమితి ముగిసిందని ఈ సందర్భంగా అధికారులు కేబినెట్‌కు తెలియజేశారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వలంటీర్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయించారని పలువురు మంత్రులు తెలియజేశారు.