APPSC Exams : ఏప్రిల్ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 06:21 AM
గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది.
8 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు ఖరారు
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది. వైసీపీ హయాంలో నోటిఫికేషన్లు జారీ చేసిన తర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇప్పుడు రాత పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 8 నోటిఫికేషన్లకు కామన్‌గా నిర్వహించే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షను ఏప్రిల్ 28న నిర్వహించనున్నారు. ఏపీ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరీక్ష ఏప్రిల్ 28న, వైద్య శాఖలో లైబ్రేరియన్ పరీక్ష 27న, గిరిజన సంక్షేమ సహాయ అధికారి పరీక్ష 30న, దివ్యాంగులు-సీనియర్ సిటిజన్ శాఖలో సహాయ డైరెక్టర్ పరీక్ష 27న, భూగర్భ జలవనరుల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్, విద్యుత్ శాఖలో సహాయ ఎలక్ర్టికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష 28న, సహాయ గణాంక అధికారి పరీక్ష 29న, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి పరీక్ష 30న నిర్వహించనున్నారు.