Share News

Andhra Pradesh: బాబు రాకకు ముందే.. కుప్పానికి అభివృద్ధి వరాలు..

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:03 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకు ముందే కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిసింది. కుప్పం మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోలు విడుదల చేసింది.

Andhra Pradesh: బాబు రాకకు ముందే.. కుప్పానికి అభివృద్ధి వరాలు..
Kuppam municipality

  • మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.92.20 కోట్లు మంజూరు.

  • కడా కార్యాలయ విస్తరణకు రూ.42.20 కోట్లు.

  • రోడ్ల మరమ్మతులకు రూ.34.27 కోట్లు.

  • మహిళా శక్తి భవన నిర్మాణంకోసం .

  • 18.70 ఎకరాల కేటాయింపు.

కుప్పం, జనవరి 05: ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకు ముందే కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిసింది. కుప్పం మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోలు విడుదల చేసింది. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధి కోసం ఏకంగా రూ.92.20 కోట్లు మంజూరయింది. ఈ నిధుల్లో రూ.22 కోట్లతో ఎన్టీఆర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, రూ.19.50 కోట్లతో మురుగు కాలువల నిర్మాణం, రూ.10 కోట్లతో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కూడళ్లు, ప్రధాన రహదారుల సుందరీకరణ, రూ.19 కోట్లతో ఉద్యాన వనాల అభివృద్ధి, రూ.3 కోట్లతో విద్యుత్తు దీపాల ఏర్పాటు, రూ.70 లక్షలతో అంగన్‌వాడీ, వసతి గృహాలు తదితర ప్రభుత్వ భవనాల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఇవిగాక మరికొన్ని అభివృద్ధి పనులు చేయనున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని రహదారుల మరమ్మతులు, అభివృద్ధికోసం రూ.34.27 కోట్లు మంజూరయ్యాయి. ఆయా అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.


ఏపీఐసీసీకి 18.70 ఎకరాల కేటాయింపు..

కుప్పంలో ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ మహిళలకు స్వావలంబన దిశగా మార్గాలను చూపడానికి నిశ్చయించారు. ఈ లక్ష్యంలో భాగంగా కుప్పం పురపాలక సంఘ పరిధిలోని పలార్లపల్లెలో ఏపీఐసీసీకి 18.70 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ స్థలాన్ని అలీప్‌ అనే సంస్థకు కేటాయిస్తారు. వీరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన శిక్షణతోపాటు వారి ఉత్పత్తుల తయారీకి తగిన మిషనరీని కూడా సమకూర్చడానికి అనువైన ఏర్పాట్లు ఇక్కడ చేయనున్నారు. కేటాయించిన స్థలంలో తొలుత మహిళా శక్తి భవనాన్ని, అనంతరం మహిళా పారిశ్రామిక వాడను నిర్మించనున్నారు. వీటికి కూడా సీఎం చంద్రబాబు తన కుప్పం పర్యటనలో స్వయంగా శంకుస్థాపన ఫలకాలను ఆవిష్కరించనున్నారు.


Also Read:

క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

వామ్మో.. ఇన్ని అరాచకాలకు పాల్పడ్డారా..!

హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 05 , 2025 | 02:03 PM