BJP MLA: జేసీ ప్రభాకర్ రెడ్డికి వార్నింగ్
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:08 PM
BJP MLA Parthasarathy : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జేసీకి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి శుక్రవారం విజయవాడలో వార్నింగ్ ఇచ్చారు.
విజయవాడ, జనవరి 03: బీజేపీ నేతలపై వరుస ఆరోపణలు సంధిస్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఎమ్మెల్యే పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో కూర్చొని.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చొనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరన్నారు.
మీకు మహిళలను గౌరవించే సంప్రదాయం కూడా లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, జేసీ ప్రభాకర్ రెడ్డిలు గత ఐదేళ్లుగా తిట్టుకొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ నేడు వైఎస్ జగన్ బెటరంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. బస్సు దగ్ధంపై పోలీస్ కేసు పెట్టానని అంటున్నారు. వ్యవస్థలను గౌరవించాలంటూ జేసీకి పార్థసారథి సూచించారు. అంతేకానీ వ్యవస్థలను నమ్మను అనడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి... అలాగే బీజేపీ అధ్యక్షరాలు దుగ్గుబాటి పురందేశ్వరి దృష్టికి తీసుకు వెళ్తామని స్పష్టం చేశారు. దేశంలోనే బీజేపీ పెద్ద పార్టీ అని గుర్తు చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు అహంకారంతో కూడిన మాటలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానంటే కుదరదన్నారు. ఒకే కూటమిలో ఉన్నామని.. మిత్ర పక్షంలో ఉన్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఓ వేళ.. బస్సులు కాల్చారని అనుమానం ఉంటే పోలీస్ కేసు పెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పార్థసారథి హితవు పలికారు.
Also Read: ప్రశాంత్ కిషోర్‌కి పెరుగుతోన్న మద్దతు
అలాగే పార్టీల మధ్య 100 గొడవలు వుంటాయన్నారు. కానీ కూటమిగా ఏర్పడిన తరువాత కలిసి వెళ్ళాల్సి ఉందని తెలిపారు. మిత్ర పక్షంలో ఉన్నప్పుడు నోరు అదుపులో వుంచుకోవాలని.. అంతేకానీ రౌడీలుగా చెలామణి అవుతామంటే మాత్రం బీజేపీ ఎప్పుడు ఒప్పుకోదని ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి స్పష్టం చేశారు.
Also Read: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?
కొత్త ఏడాది సందర్భంగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. మహిళల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును బీజేపీలోని పలువురు నేతలు తీవ్రంగా తప్పుబడుతోన్నారు. ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత, మంత్రి సత్యకుమార్ తనదైన శైలిలో స్పందించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి సైతం పైవిధంగా స్పందించారు.
Also Read: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో అగ్ని ప్రమాదం..
Read Latest AP News And Telugu news