Share News

CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:35 AM

భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్‌ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని అస్పత్రుల ద్వారా రాయలసీమలో వుండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో వున్న వైద్యులు తిరుపతిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించి.. స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు.

CM Chandrababu: అప్పుడే వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసింది..
CM Chandrababu Naidu

తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తన మనుమడు దేవాన్ష్​ (Devance) పుట్టినరోజు (Birthday) సందర్భంగా శుక్రవారం ఉదయం ఆయన కుటుంబం (Chandrababu Family)తో కలిసి తిరుమల (Tirumala) శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో (Vengamamba Food Distribution Center) కుటుంబసభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకుని ముందుకు వస్తానని.. తన మనువడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా కులదైవమైన స్వామి వారీ ఆశీస్సులు పొందడానికి వచ్చామన్నారు. ప్రతి ఏటా అన్నదానంకు విరాళం అందిస్తున్నామని, ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం ట్రస్ట్‌కు ఇప్పటి వరకు రూ. 2,200 కోట్ల విరాళాలు అందాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read..:

KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...


ప్రాణదానం ట్రస్టుని నేనే ప్రారంభించా..

భక్తులకు అన్నప్రసాద వితరణ చెయ్యడం ద్వారా చాలా తృప్తి కలుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రాణదానం ట్రస్ట్‌ను తానే ప్రారంభించానని, తిరుపతిలోని అన్ని అస్పత్రుల ద్వారా రాయలసీమలో వుండే అందరికీ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రపంచంలో వున్న వైద్యులు తిరుపతిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించి.. స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు. తిరుమల ఉన్న ప్రాంతం ఏడుకొండలు.. గతంలో కొందరు ఐదు కొండలు అంటే.. తాను పోరాటం చేసి.. కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కలు చెల్లించానన్నారు. ప్రజాహితం కోసం పని చేస్తే తనపై 27 క్లెమోర్ మైన్లతో దాడి చేశారని, శ్రీవారి ఆశీస్సులతో బయటపడ్డానని చెప్పారు. ఆ ప్రమాదం చూసిన తరువాత వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో అందరికీ తెలిసిందన్నారు.


ఎవరూ అపచారం చేయొద్దు..

తిరుమల్లో ఎవరు అపచారం చెయ్యొద్దని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పి.. ఇక్కడ నుంచే ప్రక్షాళన ప్రారంభించానన్నారు. అలిపిరి వద్ద గత ప్రభుత్వంలో ముంతాజ్,ఎమర్,దేవాలోక్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, వాటి అనుమతులను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఏడుకొండలకు అనుకోని ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు,అధికారులు అందరూ కలిసి తిరుమల పవిత్రను కాపాడాలన్నారు. దేశ వ్యాప్తంగా వున్న శ్రీవారి ఆస్తులను కాపాడుతామని, తిరుమల్లో అన్యమతస్థులు పని చెయ్యకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో వున్న అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. విదేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టు..

అమరావతిలో శ్రీవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించామని, కల్యాణం నిర్వహణతో అమరావతి పనులను ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టు ప్రారంభిస్తున్నామని, ఈ ట్రస్టుకు వచ్చిన విరాళాలతో పాటు శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన విరాళాలతో ఆలయాలను నిర్మిస్తామన్నారు. శ్రీవారి సేవను మరింత విస్తరిస్తామని, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిధి పేరుతో నూతన ట్రస్టుని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే బూతులు

పసిడి ప్రియులకు షాక్..

For More AP News and Telugu News

Updated Date - Mar 21 , 2025 | 11:35 AM