Share News

CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jan 13 , 2025 | 08:51 AM

సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్, భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు.

CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..

తిరుపతి జిల్లా: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా ఆనవాయితీ ప్రకారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) తమ స్వగ్రామైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె చేరుకున్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమాలను ముగించుకుని సంక్రాంతి పండగను కుటుంబంతో కలిసి స్వగ్రామంలో జరుపుకొనేందుకు ఆదివారం రాత్రి నారావారిపల్లె (Naravaripalle)కు చేరుకున్నారు. కాగా పురపాలక మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ముఖ్యమంత్రి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఐజీ శేముషీ బాజ్‌పాయ్‌, ఇన్‌చార్జి ఎస్పీ మణికంఠ తదితరులు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు ఆయన నారావారిపల్లె చేరుకున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి శనివారమే స్వగ్రామం చేరుకోగా.. లోకేశ్‌ తన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్‌తో కలసి ఆదివారం వచ్చారు. తల్లి, భార్యాబిడ్డలతో కలిసి సాయంత్రం నారావారిపల్లె సమీపంలోని శేషాపురం వెళ్లి.. శేషాచల లింగేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. అనంతరం కందులవారిపల్లి వెళ్లి అక్కడ వినాయకుడి ఆలయంలో పూజలు జరిపారు. తర్వాత ఆ గ్రామంలోనే ఉన్న చంద్రబాబు సోదరి హైమావతి నివాసానికి వెళ్లారు. కాగా.. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి 15వ తేదీ వరకూ అక్కడే గడుపుతారు. సోమవారం నారావారిపల్లె అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం కూడా అక్కడే ఉండి బుధవారం మధ్యాహ్నం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.


కాగా చంద్రబాబు నారవారిపల్లెలో తన భారీ కాన్వాయ్‌తో గ్రామంలోకి రాగానే గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అందరికీ ముఖ్యమంత్రి అభివాదం తెలుపుతూ గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పలువురు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ తన నివాసానికి వెళ్లారు. చంద్రబాబు రాకతో ఊరంతా ఫ్లెక్సీలు, బ్యానర్ల మయం అయింది. అలాగే సీఎం చంద్రబాబు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రోడ్లు, సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

తెలుగు ప్రజలకు చంద్రబాబు భోగి పండుగ శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ప్రజల జీవితాల్లో భోగి కొత్త వెలుగులు తేవాలని కోరుకున్నారు. భోగి మంటలతో సమస్యలన్నీ పోయి భోగభాగ్యాలు కలగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

అగ్ర రాజ్యం.. అసాధ్యం కాదు

కొంచెం తిని పెంచమ్మా...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 13 , 2025 | 10:29 AM