Share News

CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:05 PM

ఆంధ్రప్రదేశ్: ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని చంద్రబాబు చెప్పారు.

CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu

చిత్తూరు: ఈ ఏడాది గోదావరి, కృష్ణా నదీ జలాలు దాదాపు 6వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. రాష్ట్ర ప్రజలు వాటిలో కేవలం 350 టీఎంసీలు మాత్రమే వాడుకోగలిగారని ఆయన చెప్పారు. నీళ్లు ఉంటే రాయలసీమ (Rayalaseema) రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండగకు కుటుంబసమేతంగా నారావారిపల్లె (Naravaripalle) వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. స్థానిక టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. " వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. ప్రకృతి సేద్యం అన్ని వేళలా ఆదాయం ఇస్తుంది. గత ఐదేళ్లుగా బిందు సేద్యం పడకేసింది. మనం తినే ఆహారం ఎలాంటిదో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చింది. అందుకే అందరూ హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. డెయిరీలో ఆదాయం పెరిగింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. డ్రోన్ల ద్వారా చెట్లను పరిశీలించవచ్చు. దెబ్బతిన్న చెట్లకు వాటి సహాయంతో పురుగుమందులు వేయెుచ్చు. సేంద్రియ సాగుకు నేనే శ్రీకారం చుట్టా. రాష్ట్రంలో సేంద్రియసాగును మరింత ప్రోత్సహిస్తాం.


వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో సెల్ ఫోన్ మీకు ఆయుధంగా పని చేస్తుంది. సంక్షేమ పథకాల్లో మోసాలు జరగకుండా టెక్నాలజీ వినియోగిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మీ ఇంట్లోనే కరెంట్ తయారు చేయెుచ్చు. అదనపు విద్యుత్‌ను అమ్ముకుని డబ్బులు సంపాదించొచ్చు. ఇందుకు కుప్పం నియోజకవర్గాన్ని మోడల్‌గా తయారు చేస్తాం. తెలుగు వాళ్లు అమెరికాలో అమెరికన్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే పరిస్థితి ఇక్కడ రావాలి. నేను అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నా ప్రజల కోసమే పని చేస్తున్నా. నా ఆలోచనలు ఉపయోగించుకుని ఎంతోమంది జీవితంలో పైకి వచ్చారు. ఆ రోజు నేను చూపించిన విజనరీ వల్లే నేడు హైదరాబాద్‌లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయం, ఐటీ వల్ల ఎంతో మంది లాభపడ్డారని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Buddha Venkanna:మాపై దాడి అలా జరిగింది.. బుద్దావెంకన్న షాకింగ్ కామెంట్స్

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

Updated Date - Jan 14 , 2025 | 05:39 PM