CM Chandrababu.. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:34 AM
ఆంధ్రజ్యోతిలో విచిత్రాల వీధులు పేరుతో ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. తిరుపతి వీధుల్లో వచ్చిన మార్పును ఫోటోలతో సహా వివరించింది. ఈ కథనాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి మున్సిపల్ అధికారులకు అభినందనలు తెలిపారు.

అమరావతి: ఆంధ్రజ్యోతి (Andhrajyothy) సచిత్ర కథనం (Story)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. మార్పుకు కారణమైన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ (Tirupati Municipal Corporation) అధికారులకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘స్వచ్చంధ్ర మన లక్ష్యం.. ఆ దిశగా మన ప్రయాణం సాగాలి’ అంటూ పోస్టు చేశారు. మొన్నటి వరకు తిరుపతిలోనే అత్యంత మురికివాడ స్కావెంజర్స్ కాలనీ.. భరించలేని వాసన, చెత్త.. స్థానికుల జీవితాలు. కానీ ఇప్పుడు జీవన చిత్రం మారిపోతోంది. తిరుపతి స్కావెంజర్స్ కాలనీ రూపు మారిపోయింది. మురికి వాడకు రంగుల శోభ వచ్చింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య ఆధ్వర్యంలో స్మార్టు సిటీ స్వచ్ఛ సర్వేక్షన్ నిధులతో మురికివాడకు రంగులు వేయించారు. వీధులను అందమైన హరివిల్లులుగా మార్చారు. దీంతో స్కావెంజర్స్ కాలనీ సరికొత్త రంగులద్దుకుంది. దీనిపై ఆంధ్రజ్యోతిలో విచిత్రాల వీధులు పేరుతో ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. తిరుపతి వీధుల్లో వచ్చిన మార్పును ఫోటోలతో సహా వివరించింది. ఈ కథనాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి మున్సిపల్ అధికారులకు అభినందనలు తెలిపారు.
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం
హరివిల్లు నేలకు దిగినట్లు రకరకాల రంగులు..
హరివిల్లు వేలకు దిగినట్లు రకరకాల రంగులు.. చూడగానే ఆకట్టుకునేలా మంచి మంచి బొమ్మలు ప్రతి వీదీ చిత్ర విచిత్రమే.. ప్రతి గోడా వర్ణవరితమే.. ఈ "బొమ్మల కొలువు' చూడాలంటే తిరుపతికి వెళ్లాల్సిందే ఇది నగరంలోని స్కావెంజర్స్ కాలనీ! మొన్నటిదాకా తిరు పతిలోనే అత్యంత మురికి వాడ! భరించలేని వాసన, చెత్త, మధ్యే స్థానికుల జీవితాలు ఇప్పుడు ఇక్కడ జీవన చిత్రం' మారిపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే! వీధుల పరిశీలనలో భాగంగా ఇటీవల స్కావెంజర్స్ కాలనీకి వెళ్లిన తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్య అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు. ఆ కాలనీలో దాదాపు 300లకు పైగా కుటుంబాలు నివసిస్తుండగా, అందులో సగానికి పైగా మున్సి మల్ కార్పొరేషన్లో పనిచేసే పారిశుధ్య కార్మికులే. ఊరంతా శుభ్రం చేసే కార్మికులుండే ప్రాంతం కూడా, అందంగా, శుభ్రంగా ఉండాలని భావించారు. స్మార్టు సిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ నిదులతో మరికివాడకు రంగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి అందమైన రంగుల చేయించారు. దీంతో స్కావెంజర్స్ కాలనీ సరి కొత్త రంగులద్దుకుంది. ఇరుకిరుకుగా సున్నం కూడా లేకుండా ఉండే ఇళ్ల గోవులపై హరి విల్లులు రూపుదిద్దుకున్నాయి. తాజాగా అదివారం స్కావెంజర్స్ కాలనీలో కమిషనర్ మౌర్య పర్యటించి బొమ్మలు వేసేవారికి కొన్ని సలహాలు ఇచ్చారు.
కమిషనర్ ఎన్.మౌర్య కామెంట్స్..
తిరుపతి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య, సుందరీకరణ పనులను ఆదివారం మధ్యాహ్నం ఆమె పరిశీలించారు. వార్డుల తనిఖీల్లో భాగంగా స్కావెంజర్స్ కాలనీని పరిశీలిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసు కుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా అన్ని ఇండ్లపై అందమైన చిత్రాలని వేయిస్తున్నామని అన్నారు. డ్రెయినేజీ కాలువలు బాగుచేయాలని, త్రాగునీరు సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించామన్నారు. స్కావెంజర్స్ కాలనీని అందమైన కాలనీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రజలు సహకరిస్తే స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..
భక్త జనసంద్రంగా మారిన పెద్దగట్టు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News