CM Chandrababu: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
ABN , Publish Date - Jan 07 , 2025 | 08:28 AM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు. ముందుగా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని జననాయకుడు సెంటర్‌ను ప్రారంభిస్తారు.
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) రెండో రోజు మంగళవారం కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency)లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్‌అండ్ బీ అతిథి గృహం నుండి బయల్దేరి ఉదయం10.00 గంటలకు కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కు చేరుకుని జననాయకుడు సెంటర్‌ను ప్రారంభిస్తారు. తర్వాత అక్కడే ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత 1.20 గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళతారు. అనంతరం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 5.05 గంటలకు శాంతిపురం మండలం, కడపల్లి వద్ద నిర్మిస్తున్న సొంత ఇల్లు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. 6.10 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ చేరుకుని అకాడమిక్ బిల్డింగ్‌లోని ఐఎంఐబీ (1M1B కెరీర్ రెడీనెస్ సెంటర్)ను ప్రారంభిస్తారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి 7.45 గంటలకు ఆర్‌అండ్ బీ అతిథి గృహంకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 8 గంటలకు చంద్రబాబు బయలుదేరి విజయవాడకు వెళ్తారు.
కాగా చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటన కోసం సోమవారం ఆయన బెంగళూరు మీదుగా వచ్చారు. తొలిరోజు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట ద్రవిడ విశ్వవిద్యాలయంలో ‘స్వర్ణ కుప్పం విజన్-20 29’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించా రు. వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిపై పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజలను పేదరికం నుంచి బయటపడేసే పీ-4(పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్ట్‌నర్‌షిప్) విధానంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానన్నారు.
లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో..
అనంతరం కుప్పం మండలంలోని నడిమూరులో ‘పీఎం సూర్యఘర్’ పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. గ్రామంలో 132 ఇళ్లు ఉండగా.. 96 ఇళ్లను ఈ పథకానికి ఎంపిక చేశారు. 15 ఇళ్లకు సౌర ఫలకాలను అమర్చి సోలరైజేషన్ ప్రారంభించారు. లబ్ధిదారులు సుబ్రమణ్యం, నాగరాజు, పద్మావతి, చిన్నస్వామి ఇళ్లల్లో వాడుతున్న సౌరవిద్యుత్ పనితీరును చంద్రబాబు స్వయంగా పరిశీలించి.. వారి కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోలార్ విద్యుత్ పనితీరును వివరించారు. లబ్ధిదారులు, గ్రామస్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ‘సూర్యఘర్ పథకంతో భవిష్యత్‌లో కరెంటు బిల్లు కట్టే భారం ఉండదు. ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. మిగులు కరెంటుతో ఏడాదికి రూ.4 వేల ఆదాయం వస్తుంది’ అని ఆయన చెప్పారు. జూన్‌లోగా కుప్పానికి హంద్రీ-నీవా జలాలను తీసుకొస్తామన్నారు. ఆ తర్వాత.. నియోజకవర్గాన్ని కాలుష్యరహితంగా తయారుచేసే ‘నెట్ జీరో’ కాన్సె్‌ప్టపై కాన్పూర్ ఐఐటీ ప్రతినిధులతో ఎంవో యూ కుదుర్చుకున్నారు. చీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమంలో వ్యవసాయం చేస్తున్న రైతులతో చంద్రబాబు మాట్లాడారు. రాత్రికి ద్రవిడ యూనివర్సిటీకి చేరుకుని టీడీపీ శ్రేణులతో సీఎం సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నా చిన్నప్పుడు ఇంట్లో కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకొనేవాళ్లం. ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగాం. కుప్పంలోని నడిమూరు.. రాష్ట్రంలోనే తొలి సోలరైజేషన్ గ్రామంగా చరిత్రలో నిలువనుంది. దీనివల్ల ఇక కరెంటు బిల్లుల భారం ఉండదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రతి కుటుంబమూ మిగులు కరెంటును అమ్ముకునే స్థాయికి ఎదిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగానే కుప్పం నియోజకవర్గాన్ని సోలార్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసి నడిమూరు నుంచి సోలరైజేషన్‌కు శ్రీకారం చుట్టానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కిమ్స్ ఆస్పత్రికి రానున్న సినీ నటుడు అల్లు అర్జున్..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News