Share News

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Mar 04 , 2025 | 09:45 AM

Hall ticket issue: ఇంటర్ స్టూడెంట్స్‌ పట్ల ఓ కాలేజ్ వ్యవహరించిన తీరుతో వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థుల పట్ల కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.

Hall ticket issue: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న కాలేజ్.. ఏం జరిగిందంటే
Inter Students

తిరుపతి, మార్చి 3: వారంతా ఇంటర్ స్టూడెంట్స్ (Inter Students). ఏడాదిగా కష్టపడి చదివారు. పరీక్షల సమయంలో మరింత కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారు. పగలు, రాత్రి తేడా లేకుండా గుడ్ పర్సెంటేజ్‌ రావడమే లక్ష్యంగా చదివారు విద్యార్థులు. ఇంతలా కష్టపడిన వారి జీవితాలతో కాలేజీ యాజమాన్యం ఆటలాడింది. సంవత్సరకాలంగా చదవిన విద్యార్థులు చివరకు పరీక్షలు (Inter Exams) వచ్చే సరికి రాయలేని పరిస్థితికి వెళ్లారు. ఇంతకీ ఆ కాలేజ్ చేసిన నిర్వాకం ఏంటి.. విద్యార్థులు పరీక్షలు ఎందుకు రాయలేకపోయారో ఇప్పుడు చూద్దాం.


తిరుపతిలోని ఓ కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఇంటర్ పరీక్షకు హాట్‌ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులను కాలేజీ యాజమాన్యం ముప్పుతిప్పలకు గురిచేసింది. తిరుపతి బైరగపట్టెడలోని ఓం ఎస్.వి.వి జూనియర్ కాలేజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు తొమ్మిది మంది విద్యార్థుల పట్ల కాలేజ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వారందరి వద్ద ఫీజులు కట్టించుకుని మరీ హాల్‌ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని నమ్మబలికారు. ఆ తొమ్మిది విద్యార్థులను బస్సులో ఎక్కించుకుని పరీక్షా కేంద్రాల వద్ద తీసుకెళ్లారు కూడా. దీంతో తాము పరీక్ష రాయబోతున్నామని ఎంతో ఆనందించారు విద్యార్థులు. అయితే చివరి నిమిషంలో వారు ఎక్కిన బస్సులోనే తిరిగి ఇంటి వద్ద దించేశారు టీచర్స్. ఇదేంటని అడిగినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో ఫీజులు చెల్లించినప్పటికీ తమ పిల్లలకు హాల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల పట్ల కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిపై తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

MLC Elections: వారు ఓటు వేయడం నాకు గర్వకారణం: ఆలపాటి రాజా


ఈరోజు (మంగళవారం) ఉదయం ఎగ్జామ్‌కు వెళ్తున్న కాలేజీ బస్సులను అడ్డుకుని మరీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అందుకు వారు ససేమిరా అన్నారు.. తమ పిల్లలను అన్యాయం చేశారని.. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో కాలేజ్ బస్సులను పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అంగీకారించారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు. దీంతో మిగతా విద్యార్థులను ఎగ్జామ్ రాయించడానికి టీచర్స్ తీసుకెళ్లారు. అయితే మొత్తానికి కాలేజీ యాజమాన్యం తీరుతో తొమ్మిది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉండిపోయినట్లైంది. దీనిపై పలు విద్యార్థి సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాలేజ్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎలాగైనా విద్యార్థులను న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Ukraine Military aid Paused: ఉక్రెయిన్ అధ్యక్షుడికి భారీ షాకిచ్చిన ట్రంప్.. మిలిటరీ సాయం నిలిపివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2025 | 10:25 AM