Share News

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

ABN , Publish Date - Jan 09 , 2025 | 10:15 AM

తిరుపతి: వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భక్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. క్యూలైన్లో ఉన్న భక్తులను ఒక్కసారిగి విడిచిపెట్టడంతో తోపులాట జరిగిందని, ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిలాట జరిగిందని.. సరైన భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

తిరుపతి: వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట (Stampede) జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతి (Tirupati)లోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. ఈ సందర్భంగా తొక్కిసలాటపై అక్కడున్న భక్తులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడారు. క్యూలైన్లో ఉన్న భక్తులను ఒక్కసారిగి విడిచిపెట్టడంతో తోపులాట జరిగిందని, ఒకరినినొకరు తోసుకుంటూ తొక్కిలాట జరిగిందని, పెద్దవాళ్లు, చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అయిందని చెప్పారు. భద్రత సరిగాలేదని 3, 4గురు పోలీసులు ఉన్నారని.. తొక్కిసలాట జరిగినప్పుడు 20 మంది వరకు వచ్చారని తెలిపారు. నాలుగు లైన్లలో ఉన్నవారిని ఒక్కసారి వదలడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రతి ఏడాది తాము వైకుంఠ ఏకాదశికి తిరుమల వస్తామని, ఇలా జరగడం ఇది మొదటిసారని భక్తులు తెలిపారు.


మహిళా భక్తురాలు మాట్లాడుతూ మంగాపురంలో టిక్కెట్లు ఇచ్చి ఉంటే ఈ తొక్కిసలాట జరిగేదికాదని ఆమె అన్నారు. తిరుపతిలో టిక్కెట్లు ఇవ్వడంతో భక్తుల సంఖ్య పెరిగిందని దానికి తగ్గట్టుగా పోలీసు భద్రత లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగి విడిచిపెట్టకూడదని.. ఒక్కొక్క క్యూలైన్ విడిచిపెడితే తొక్కిసలాట జరిగేదికాదని అన్నారు. ఒకటో కంపార్టుమెంట్ నుంచి వదిలితే బాగుండేదని, అలా కాకుండా 4, 5 క్యూలైన్లు విడిచిపెట్టారని దీంతో అంతా ఒకేసారి రావడంతో క్రౌడ్ పెరిగి తోపులాట జరిగిందని భక్తులు తెలిపారు. ఒకటో క్యూలైన్ నుంచి విడిచిపెడితే ఈ సమస్య వచ్చేది కాదేని భక్తులు తెలిపారు.

భక్తులే తోసుకుని వచ్చారు.. భక్తురాలు..

ఒక్కసారిగా గేట్ తీసినప్పుడు భక్తులంతా తోసుకుని వచ్చారని.. సిబ్బంది వదలలేదని.. భక్తులే తోసుకుని వచ్చారని మరో భక్తురాలు ఏబీఎన్‌కు తెలిపారు. భద్రతా సిబ్బందిని అనడానికి ఏమీ లేదని, వచ్చిన భక్తుల్లో కంట్రోల్ లేదని ఆమె అన్నారు. పురుషులు కూడా మహిళలు, పిల్లలు ఉన్నారని చూసుకోవడం లేదని తోసుకుంటూ వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరికొందరు పోలీసులు వైఫల్యమే కారణమని చెబుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్లు చేశా!


గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే... బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా... బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డరు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్

తిరుపతి ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి.. ఆవేదన..

హుటాహుటిన తిరుపతి చేరుకున్న మంత్రి అనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 09 , 2025 | 10:15 AM