Judge: పెండింగ్ కేసులు త్వరగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:17 AM
కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి కోరారు.

చిత్తూరు లీగల్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి కోరారు. శనివారం చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరుజిల్లా పరిధిలోని న్యాయమూర్తులకు కేసుల విషయమై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి న్యాయమూర్తి చట్టాలపై అవగాహన పెంచుకుని కేసులను త్వరగా పూర్తిచేసేలా తమవంతు పాత్ర పోషించాలన్నారు. కేసులు పెండింగ్‌లో ఉంటే కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం కేసుల పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావుతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.