Share News

TTD: తిరుమలలో సోమవారం నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభం

ABN , Publish Date - Jan 20 , 2025 | 07:18 AM

ఆదివారంతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో సోమవారం నుంచి శ్రీవారి దర్శనాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను టీటీడీ అధికారులు తెరిచిన విషయం తెలిసిందే.

TTD:  తిరుమలలో సోమవారం నుంచి యధావిధిగా దర్శనాలు ప్రారంభం

తిరుమల: శ్రీవారి ఆలయంలో (TTD) ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి (Vaikuntha Gates Closed). పదిరోజుల పాటు టీటీడీ అధికారులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ పది రోజుల్లో దాదాపు 6 లక్షల 83 వేల 304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని.. ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే. గతేడాది తరహాలోనే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. చివరిగా ఆదివారం అర్ధరాత్రి ఏకాంతసేవతో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఇక సోమవారం నుంచి యధావిధిగా శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరిగి ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రావడంతో టీటీడీ అధికారులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు.


కాగా ఆదివారం చివరి రోజు కావడంతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు తరలి వచ్చారు. కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ అధికారులు జారీ చేశారు. గత తొమ్మిది రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలకు సంబంధించి 50వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. అలాగే ఆన్‌లైన్‌లో 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది.


2023-24లో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 2022 లో 3 లక్షల 78 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. 2020-21లో 4 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. కాగా ఆదివారం తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సెక్యూరిటీ సిబ్బంది తిరుమలకు పంపారు. ఆదివారంతో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈనెల 10 నుంచి 19 వరకు అంటే దాదాపు పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది.

రోజుకు 70 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారుల ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు కూడా ఒక ఉద్యోగికి ఐదు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేశారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. భద్రతా సిబ్బంది కూడా తనిఖీలను వేగవంతం చేసి కార్లను తిరుమలకు పంపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మాయిల విజయంలో తెలుగోడు

ఎవరీ హిమాని?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 20 , 2025 | 07:18 AM