Share News

BR Naidu: ఆ బాధితులకు పరిహారం అందజేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..

ABN , Publish Date - Jan 11 , 2025 | 08:40 PM

ఆంధ్రప్రదేశ్: తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి స్విమ్స్‌(SWIMS)లో చికిత్సపొందుతున్న బాధితులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) పరిహారం అందజేశారు. రామసముద్రానికి చెందిన తిమ్మక్క, విశాఖపట్నానికి చెందిన ఈశ్వరమ్మకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఆయన పరిహారం అందించారు.

BR Naidu: ఆ బాధితులకు పరిహారం అందజేసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు..
TTD Chairman BR Naidu

తిరుపతి: తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి స్విమ్స్‌ (SWIMS)లో చికిత్సపొందుతున్న బాధితులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) పరిహారం అందజేశారు. రామసముద్రానికి చెందిన తిమ్మక్క, విశాఖపట్నానికి చెందిన ఈశ్వరమ్మకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఆయన పరిహారం అందించారు. అలాగే స్వల్పంగా గాయపడిన ఏడుగురికి రూ.2లక్షల చొప్పున అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడారు.

CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రూపంలో ఏపీకి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు


ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. "తొక్కిసలాట బాధితులకు పరిహారం అందించేందుకు బోర్డు సభ్యులతో రెండు బృందాలను నియమించాం. విశాఖ, నర్సీపట్నం సందర్శించే బోర్డు సభ్యుల బృందంలో సభ్యులుగా జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాకలక్ష్మి, జానకీదేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు, కేరళను సందర్శించే బృందంలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేశ్ కుమార్, శాంతారాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల పరిహారం అందిస్తాం. వారి కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. వారి పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు బృందం వివరాలు సేకరిస్తుంది. అలాగే పాక్షికంగా గాయపడిన వారిలో ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఏడుగురికి ఇక్కడే పరిహారం అందించాం. మిగిలిన 24 మందికి రూ.2 లక్షలు పరిహారం కమిటీ సభ్యులు అందజేస్తారు. జనవరి 12వ తేదీ నుంచి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి ఈ బృందాలు పరిహారం అందజేస్తాయని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలి

Tirumala: తిరుమలలో చిరుత.. టీటీడీ ఉద్యోగికి తీవ్రగాయాలు.. బాబోయ్..

Updated Date - Jan 11 , 2025 | 08:45 PM