Share News

Tirumala: ఇంటి దొంగలను పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jan 15 , 2025 | 06:17 PM

తిరుమల శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమల(Tirumala)లో మరోసారి కలకలం రేపింది. నకిలీ టికెట్ల(Fake Tickets)తో భక్తులకు దర్శనం చేయిస్తున్న ఇంటి దొంగలను టీటీడీ విజిలెన్స్ విభాగం (TTD Vigilance Department) అధికారులు పట్టుకున్నారు.

Tirumala: ఇంటి దొంగలను పట్టుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం.. విషయం ఏంటంటే..
Tirumala

తిరుమల: శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమల (Tirumala)లో మరోసారి కలకలం రేపింది. నకిలీ టికెట్ల (Fake Tickets)తో భక్తులకు దర్శనం చేయిస్తున్న ఇంటి దొంగలను టీటీడీ విజిలెన్స్ విభాగం (TTD Vigilance Department) అధికారులు పట్టుకున్నారు. స్వామివారి దర్శనానికి సంబంధించిన నకిలీ టికెట్లు విక్రయిస్తూ లక్షలు దండుకుంటుకున్న దళారీలను రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. టీటీడీ సిబ్బంది లక్ష్మీపతి, మణికంఠ (Manikanta), భాను ప్రకాశ్‌ ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా దందా నిర్వహిస్తున్నారు. స్వామివారి ఆదాయాన్ని అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండికొడుతూ చివరికి అడ్డంగా దొరికిపోయారు.


తిరుమలలో అగ్నిమాపక పీఎస్జీ మణికంఠ, భానుప్రకాశ్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి ముగ్గురూ మోసాలకు తెరతీశారు. కొన్నేళ్లుగా మణికంఠ సహాయంతో వీరంతా స్వామివారి దర్శనానికి సంబంధించిన రూ.300ల నకిలీ టికెట్లను తయారు చేస్తున్నారు. వాటిని భక్తులకు విక్రయిస్తూ స్వామివారి ప్రత్యేక దర్శనం చేయిస్తున్నారు. అయితే అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు వారిని ఇవాళ (బుధవారం) అడ్డుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద వారిని నిలిపివేసి నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్ నుంచి వచ్చిన 11 మంది భక్తులకు టికెట్లు అమ్మి రూ.19 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు.

Updated Date - Jan 15 , 2025 | 06:17 PM