Vijayawada : 3 లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jan 12 , 2025 | 03:32 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో.....
పిఠాపురంలోని గ్రంథాలయానికి బహూకరణ?
విజయవాడ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమారు రూ.3 లక్షలు విలువ చేసే పుస్తకాలను కొనుగోలు చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్త క మహోత్సవాన్ని శనివారం సందర్శించారు. దాదా పు రెండున్నర గంటలపాటు ప్రతి స్టాల్‌కు వెళ్లి పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు పుస్తకాలను కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యాని కి సంబంధించిన పలు పుస్తకాలు పరిశీలించారు. ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల వర కూ పలువురి రచనలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా తనకు ఎంతో నచ్చిన ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకాన్ని చూసి సంతోషించారు. ఈ పుస్తకం చదివితే నిరాశా నిస్పృహలను అధిగమించి ఆశావాద భావన కలుగుతుందన్నారు. బహుమతిగా ఇవ్వడానికి ఉంటాయని ఎక్కువ సంఖ్యలో ఈ పుస్తకాలను కొనుగోలు చేశారు. పిఠాపురంలో ఒక భారీ గ్రంథాలయాన్ని నిర్మించే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టు సమాచారం. దానికి ఈ పుస్తకాలను ఇవ్వ నున్నట్టు ప్రచారం జరుగుతోంది.