Share News

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:45 PM

Tirumala: ఆంగ్ల సంవత్సరాది వేళ.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ నూతన సంవత్సర వేళ.. టీటీడీ సైతం సాధారణ రోజుల వలే.. ఏర్పాట్లు చేసింది.

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే..
Devotees rush normal at Tirumala

తిరుమల, జనవరి 01: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల వేళ.. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. దీంతో శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తుల సంఖ్య బుధవారం సాధారణంగా ఉంది. దాంతో స్వామి వారి దర్శనాన్ని భక్తులు త్వరితగతిన చేసుకొంటున్నారు. అయితే తెలుగు సంవత్సరాది.. అంటే ఉగాది పర్వదినం. ఆ రోజు.. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేపట్టాలని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. దీంతో అంగ్ల నూతన సంవత్సర వేడుకల వేళ.. తిరుమలలో ఎప్పటి వలే సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు 60 నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారని సమాచారం.

అసలు అయితే ఆంగ్ల నూతన సంవత్సరం వేళ.. తిరుమలకు లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం రోజు.. టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు. సాధారణ రోజుల వలే.. భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేళ.. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మాములుగా ఉంటుంది.


మరోవైపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని.. ఆ రోజు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందీ టీటీడీ. దీంతో ఆ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది సంవత్సరాలుగా.. ఉగాది రోజు భారీగా భక్తులు తిరుమలకు పోటెత్తుతోన్నారు.

Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి


ఇక బుధవారం శ్రీవారిని దర్శించుకొనే భక్తులు ఎటువంటి టోకెన్ కానీ.. టికెట్ కానీ లేకుండా ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపే శ్రీవారిని దర్శించుకొంటున్నారు. ఇక స్లాటెడ్ టోకెన్ కానీ.. టికెట్ కానీ పొందిన భక్తులు మాత్రం కేవలం మూడు గంటల్లోనే శ్రీవారిని దర్శించుకొంటున్నారు. ఇక లడ్డూ విక్రయాలు భారీగా జోరందుకొన్నాయి. అలాగే డైరీలు, శ్రీవారి క్యాలెండర్ల కోసం కౌంటర్ల వద్ద భక్తులు భారీగా క్యూ కట్టారు.

Also Read: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ


మరోవైపు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే.. ముక్కోటి ఏకాదశి మరికొద్ది రోజుల్లో రానుంది. ఆ రోజు కోనేటి రాయుడిని దర్శించుకొనేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తనున్నారు. అందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఆ దేవ దేవుడిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకొంటే.. సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఆ రోజు భక్తులతో తిరుమల కిటకిటలాడనుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు.. స్వామి వారికి సంబంధించిన దాదాపు అన్ని సేవలను టీటీడీ రద్దు చేస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే.

Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 05:45 PM