Share News

Kakinada: గంజాయి స్మగ్లర్ల దారుణం.. తనిఖీలు చేస్తున్న పోలీసులపైకే ఏకంగా..

ABN , Publish Date - Jan 02 , 2025 | 09:45 AM

కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారిని కారుతో ఢీకొట్టారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు.

Kakinada: గంజాయి స్మగ్లర్ల దారుణం.. తనిఖీలు చేస్తున్న పోలీసులపైకే ఏకంగా..
Krishnavaram Tollgate

కాకినాడ: కిర్లంపూడి (Kirlampudi) మండలం కృష్ణవరం (Krishnavaram) టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. నూతన సంవత్సరం వేళ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు స్మగ్లర్లు షాక్ ఇచ్చారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు (Police) ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే అదే సమయంలో గంజాయి స్మగ్లర్ల కారును పోలీసులు ఆపేశారు. కారును పక్కకు తీసుకురావాల్సింది పోలీసులు వారికి చెప్పారు.

రిజర్వ్‌ ఫారెస్టులో ‘సజ్జల’ సామ్రాజ్యం!


అయితే కారును పక్కకు ఆపుతున్నట్లు నటించిన స్మగ్లర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు. దీంతో కారు ఇద్దరి కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. వాహనం ముందు నిలుచున్న కానిస్టేబుల్ లోవరాజుతోపాటు మరో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్లను తోటి పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే టోల్ ప్లాజా వద్ద నుంచి పారిపోయిన నిందితులు తమ కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు.

CM Chandrababu: 1600 మందికి రూ.24.16 కోట్లు లబ్ధి


దుండగులంతా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే గంజాయి స్మగ్లర్లు కారును పోలీసులపైకి ఎక్కించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్యాంక్‌ మేనేజర్‌ ఉరఫ్‌ లేడీ రౌడీ షీటర్‌

Liquor sales: 200 కోట్లు తాగేశారు

Updated Date - Jan 02 , 2025 | 09:50 AM