Share News

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:13 PM

purandeswari: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ పురందేశ్వరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అసెంబ్లీ వచ్చింది కేవలం హాజరుకోసం మాత్రమే అని దుయ్యబట్టారు.

purandeswari: అసెంబ్లీకి జగన్ హాజరుపై ఎంపీ పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యలు
MP Purandeswari

రాజమండ్రి, ఫిబ్రవరి 25: ఏపీ అసెంబ్లీలో(AP Assembly Session) గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభకు వచ్చి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి ఆపై వెళ్లిపోవడంపై కూడా అధికారపక్షం మండిపడుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి (MP Daggubati Purandeswari) స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పురంధేశ్వరి చురకలంటించారు. ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందని.. అందుకే జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చారని అన్నారు.


jagana-laddu.jpg

కానీ ప్రజలిచ్చిన బాధ్యతను జగన్ మర్చిపోవడం సరికాదన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను లేవనెత్తాలని తెలిపారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిన విషయం ఆంధ్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు కోసం జగన్ మాట్లాడకపోవటం, హాజరు కోసం వెళ్ళటం సిగ్గుచేటు అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు.


ఎంపీ ఇంకా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. మహిళలు, యువత, పెట్టుబడులు, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో మూడు కోట్ల ఇళ్ళు పేదలకు నిర్మిస్తామని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా మహిళలు వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించామన్నారు. విశాఖ, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి రైల్వే స్టేషన్ల అబివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించి.. ఆసుపత్రులో శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

మోసం చేస్తూనే ఉంటా.. జగన్ కొత్త నినాదం..!

ఎండకాలంలో హ్యాపీ లైఫ్ కోసం అద్భుత చిట్కాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 12:13 PM