AP Police: పిఠాపురం జనసేన సభలో పోలీసుల ఓవరాక్షన్
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:20 PM
Janasena sabha: పిఠాపురంలో జరుగుతున్న జనసేన సభలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సభకు వచ్చిన జనసేన నేత, టీడీపీ నేత విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు.
పిఠాపురం, జనవరి 10: పిఠాపురంలో జనసేన సభ (Janasena Sabha) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సభ లోపలికి వెళ్లేందుకు వచ్చిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జనసేన మహిళా కో ఆర్డినేటర్ చల్లా లక్ష్మిని పోలీసులు నెట్టేశారు. కిందపడిన లక్ష్మి తలకు స్వల్పంగా గాయమైంది. పోలీసుల తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ పిఠాపురం సభలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా పోలీసులు అడ్డుకున్నారు. కూటమి నేతను అని చెప్పినా వినకుండా పోలీసులు లోనికి వెళ్లనీయలేదు. దీంతో పోలీసులపై వర్మ ఫైర్ అయ్యారు. వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోతానంటూ వర్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తరవాత తన అనుచరులతో కలిసి వర్మ సభ లోపలికి వెళ్లారు. మరోవైపు కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) పిఠాపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమారపురంలో మినీ గోకులాన్ని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 12,500 మినీ గోకులాలను ఇక్కడి నుంచే ప్రారంభించారు పవన్. ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా పశువుల రక్షణకు మినీ గోకులాల షెడ్లను కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్.. రాజానగరం ఏడీబీ రోడ్డు మీదుగా రంగంపేట మండలం వడిశలేరుకు చేరుకున్నారు. ఈనెల 4న రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
ఆ ప్రమాద ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అనంతరం వడిశలేరు నుంచి రోడ్డు మార్గాన పిఠాపురం మండలం కుమారపురంకు చేరుకున్నారు. అక్కడ మినీ గోకులాన్నీ ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచి పిఠాపురం పాతబస్టాండ్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఆపై జనసేన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం తిరిగి రాజమహేంద్రవరం ఎయర్ పోర్టుకు చేరుకుని మంగళగిరి క్యాంపు కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోకున్నారు.
ఇవి కూడా చదవండి...
Minister Narayana: భవన నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
AP Highcourt: రఘురామ కేసులో ప్రభావతికి హైకోర్టు షాక్
Read Latest AP News And Telugu news