Share News

Liquor Scam: మద్యం స్కాంను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:55 PM

ఏపీలో మద్యం కుంభకోణంకు సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై నిన్న (మంగళవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఎంపీ లావు వివరించారు.

Liquor Scam: మద్యం స్కాంను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం
CM Chandrababu with MP Lavu Sri Krishna

అమరావతి: ఏపీ ముఖమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu)తో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (MP Lavu Sri Krishna Devarayalu)భేటీ అయ్యారు. నిన్న (మంగళవారం) కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) భేటి తరువాత బుధవారం చంద్రబాబుతో భేటీ జరిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం కుంభకోణం (Liquor Scam) వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం (AP Government) తీవ్రంగా పరిగణించింది. మద్యం స్కాంపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గత వైసీపి ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని ఎంపీ లావు పార్లమెంటులో చెప్పిన విషయం తెలిసిందే. రూ.4 వేల కోట్లను విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి చర్చించారు. ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీ పరిణామాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.

Also Read..: సొంతపార్టీ ఎంపీపీ కిడ్నీప్..


కాగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం లోక్‌సభలో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టి సారించారు. మంగళవారం పార్లమెంటు సమావేశాల మధ్యలోనే ఆయన్ను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించారు. సంబంధిత కీలక పత్రాలను అందజేశారు. రూ.90వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవికాకుండా మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్‌, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌.సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను లావు అందించారు. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్‌ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.


ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి, రాజకీయాల నుంచి నిష్క్రమించారని కూడా లావు వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకుని అర్థంపర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని, అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారని తెలిపారు. ప్రభుత్వ దుకాణాలలో రూ.99 వేల కోట్ల మేరకు అమ్మకాలు జరిగితే, అందులో రూ.690 కోట్లు మాత్రమే డిజిటల్‌ లావాదేవీలు జరిగాయని, మిగతా సొమ్ములో అత్యధిక భాగం జగన్‌, ఆయన అనుయాయులు కబళించారని వివరించారు. కాగా, సోమవారం లోక్‌సభలో 2025-26 ఆర్థిక బిల్లుపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జగన్‌ మద్యం కుంభకోణాన్ని వివరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 మంది ప్రైవేట్‌ ఐఎంఎ్‌ఫఎల్‌లను, డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, 60శాతం ఉత్పతి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. 2019-2024 మధ్య 38 కొత్త బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అవన్నీ అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు చెందినవని తెలిపారు. 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయని, రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మద్యం ేసకరణను పూర్తిగా నియంత్రించిందని, అధికార పార్టీ సహచరుల నియంత్రణలో ఉన్న బ్రాండ్‌లకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. రూ.2,000 కోట్లు ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ పేరుతో దుబాయ్‌కి మళ్లించారన్నారు. ఏపీలో మద్యం స్కాంకు కారణమైన వారిపై దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రస్తావన

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత

For More AP News and Telugu News

Updated Date - Mar 26 , 2025 | 01:01 PM