Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు అత్యవసర మీటింగ్.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 08:42 PM

ఆంధ్రప్రదేశ్: సంచలనం సృష్టిస్తున్న హెచ్ఎంపీ వైరస్‌(HMPV) విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) అలర్ట్ అయ్యింది. హెచ్ఎంపీ వైరస్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (సోమవారం) ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబు అత్యవసర మీటింగ్.. ఎందుకంటే..
CM Chandrababu Teleconference

అమరావతి: సంచలనం సృష్టిస్తున్న హెచ్ఎంపీ వైరస్‌ (HMPV) విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) అలర్ట్ అయ్యింది. హెచ్ఎంపీ వైరస్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ (సోమవారం) ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైరస్‌పై ప్రభుత్వానికి టెక్నికల్ సాయం అందించే టాస్క్‌ఫోర్స్ లేదా ఎక్స్‌పర్ట్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీలో మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రీషియన్, శ్వాసకోస వ్యాధి నిపుణులు, ప్రివెంటివ్ మెడిసన్ ఆచార్యులు సభ్యులుగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

CM Chandrababu: స్వర్ణ కుప్పం విజన్-2029 ఆవిష్కరణ.. సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే..


భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రభుత్వానికి కమిటీ సూచనలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. చైనాలో పుట్టిన హెచ్ఎంపీ వైరస్‌కు సంబంధించిన కేసులు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదు అయ్యాయంటూ వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తోపాటు, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Palnadu: తురకా కిషోర్‌ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు


హెచ్ఎంపీ వైరస్- చంద్రబాబు ఏమన్నారంటే..

హెచ్ఎంపీ వైరస్ 2001 నుంచే ఉందని, కానీ వ్యాప్తి తీవ్రత చాలా తక్కువని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రజలకు ఆయన ధైర్యం చెప్పారు. తీవ్రమైన ఊపిరి సంబంధ సమస్యలు ఈ వైరస్ వల్ల రావని, ఇప్పటివరకూ రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతి చాలా స్వల్పంగా ఉన్నందున ఇప్పటికిప్పుడు అప్రమత్తత అవసరం లేదని ఆయన చెప్పారు. హెచ్ఎంపీ వైరస్ సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధని, ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని సీఎం వెల్లడించారు.

Nara Lokesh: విడాకులు ఉండవు.. పొత్తుపై తేల్చేసిన లోకేష్


వైరస్ నిర్ధారణకు సంబంధించి యూనిఫ్లెక్స్ కిట్లు వెంటనే సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. వైరస్ వల్ల కలిగే వ్యాధి నిర్ధారణకు రాష్ట్రంలో ఐసీఎంఆర్ వైరాలజీ ల్యాబ్లు 10 వరకూ ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ కోసం జర్మనీ నుంచి 3,000 టెస్టింగ్ కిట్లను సైతం వెంటనే సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్-95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలపగా.. శానిటైజర్ రానున్న మూడు నెలలకు సరిపోయేంత సమకూర్చుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh: విడాకులు ఉండవు.. పొత్తుపై తేల్చేసిన లోకేష్

Palnadu: తురకా కిషోర్‌ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు

Updated Date - Jan 06 , 2025 | 08:48 PM