Share News

AP News: బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:09 AM

Andhrapradesh: విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అక్కా చెల్లెల్లు దాసరి నాగమణి (34), మాధవి లత (30)కు మంటలు అంటుకున్నారు. ఆ తరువాత క్షణాల్లోనే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ రాజ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

AP News:  బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే
Bapatla fire Accident

బాపట్ల, జనవరి 6: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తోడబుట్టువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాధ ఘటనలో అక్కాచెల్లెల్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు. విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అక్కా చెల్లెల్లు దాసరి నాగమణి (34), మాధవి లత (30)కు మంటలు అంటుకున్నారు. ఆ తరువాత క్షణాల్లోనే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి లక్ష్మీ రాజ్యంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అగ్నిప్రమాదంలో అక్కా చెల్లెల్లు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తీవ్రంగా గాయపడిన తల్లి లక్ష్మీరాజ్యంకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఆమె పరిస్థితిపై వైద్యులు సమాచారం ఇవ్వాల్సి ఉంది.


మంత్రి దిగ్భ్రాంతి..

gottipati-ravikumar-ministe.jpg

పర్చూరు అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కాచెల్లిళ్లు చనిపోవడం కలిచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై అధికారులతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. ప్రమాదంపై దర్యాప్తుకు మంత్రి ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే సహించేది లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.


మరో ప్రమాదం..

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నల్లజర్ల కొత్తపేటలో చలి బాధ తట్టుకునేందుకు వేసిన చలిమంట కారణంగా తాటాకు ఇళ్లు అంటుకుంది. ఈప్రమాదంలో ఇంటిలో నిద్రిస్తున్న నామాల దానియేలు (28) అనే వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. అయితే మృతుడు దివ్యాంగుడు కావడంతో బయటకు రాలేకపోయినా వైనం బాధను కలిగిస్తోంది. ఇంటికి మంటలు అంటుకోవడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే దానియేలును బయటకు తీసుకుని వచ్చేటప్పటికే అతడు మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

Nara Lokesh: ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

Loyola College Walkers: మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 06 , 2025 | 11:12 AM