Share News

Supreme Court: గాలి జనార్దన్ రెడ్డి కేసు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Jan 10 , 2025 | 09:17 PM

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల విచారణ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేసుల విచారణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: గాలి జనార్దన్ రెడ్డి కేసు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
Supreme Court

ఢిల్లీ: కర్ణాటక (Karnataka) మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) అక్రమ మైనింగ్ కేసుల విచారణ తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేసుల విచారణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐ(CBI)కు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే చివరి అవకాశం అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. కర్ణాటక రాష్ట్రం ఓబుళాపురం మైనింగ్ కేసుల విచారణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని గతేడాది సెప్టెంబర్ 30న సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే విచారణ పూర్తి కాలేదని, మరికొన్ని నెలల సమయం కావాలంటూ తాజాగా సీబీఐ మరోసారి ఉన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది.

Tirupati Stampede: ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి ఆనం


అయితే సీబీఐ పిటిషన్‌పై ఇవాళ (శుక్రవారం) జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు విచారణలో తీవ్ర జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు మరో నాలుగు నెలలు మాత్రమే చివరిగా గడువు పెంచుతామని, ఇకపై పెంచేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. బళ్లారిలోని ఓబుళాపురంలో అక్రమ మైనింగ్‌కి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ పాల్పడ్డారంటూ 2011లో వారిపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే 13 ఏళ్లు అయినా ఈ కేసు కొలిక్కి రాకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. హైకోర్టులో పిల్

AP News: టీటీడీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నా: బీఆర్ నాయుడు..

Updated Date - Jan 10 , 2025 | 09:19 PM