Share News

AP News: టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:13 PM

చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డిల హస్తం ఉందని, వారిద్దరినీ కుట్రదారులుగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

AP News: టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు
TDP Leader Kanaparthi Srinivasa Rao

గుంటూరు జిల్లా: పుంగనూరు టీడీపీ నాయకుడు (TDP Leader) రామకృష్ణమ నాయుడి (Ramakrishnama Naidu) హత్య (Murder) వెనక వైఎస్సార్‌సీపీ నేతలు (YSRCP Leaders) ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (MLA Peddireddy Ramachandra Reddy), ఆయన కుమారుడు ఎంపీ మిదున్ రెడ్డి (MP Midun Reddy) హస్తం ఉందని. ఈ కేసులో వారిద్దరినీ కుట్రదారులుగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు (Kanaparthi Srinivasa Rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరపున ఏజెంట్‌గా కూర్చుంటే హత్యలు చేస్తారా.. అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ రౌడీలు, గుండాలను పోలీసులు ఉక్కు పాదంతో అణిచివేయాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలని కనపర్తి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read..:

ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..


ప్రభుత్వం సీరియస్..

కాగా చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వైఎస్సార్‌సీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని రామకృష్ణ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పుంగనూరు సీఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్‌ సాంబను బాధ్యులుగా పేర్కొంటూ వారిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం వహించి రామకృష్ణ హత్యకు కారణమయ్యారంటూ మండిపడింది. బాధితుడి పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గానూ వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లాలో శనివారం దారుణం జరిగింది. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటరమణ అతి కిరాతకంగా హతమార్చాడు. పాత కక్ష్యల నేపథ్యంలో వెంకటరమణ వేట కొడవలి తీసుకుని వెంటపడి మరీ రామకృష్ణను చంపేశాడు. అయితే దాడిలో బాధితుడికి తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు.


వీడియో విడుదల..

అయితే హత్యకు నాలుగైదు రోజుల ముందే బాధితుడు రామకృష్ణ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులంతా వన్ సైడ్‌గా వ్యవహరిస్తూ తనకు న్యాయం చేయడం లేదని పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ పోలీసులను వీడియో ద్వారా వేడుకున్నాడు రామకృష్ణ. అయినా పోలీసుల నుంచి ఏమాత్రం స్పందన రాలేదు. వీడియో రిలీజ్ చేసిన రోజుల వ్యవధిలోనే ప్రత్యర్థుల చేతుల్లో రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారికి జీతాలు ఎలా ఇస్తారు: టీడీపీ

రూ. 800 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపన..

For More AP News and Telugu News

Updated Date - Mar 16 , 2025 | 12:13 PM