Minister Durgesh: ఆ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించండి.. మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:36 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి కందుల దుర్గేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ జేశారు.
అమరావతి: విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో త్వరలోనే పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు (Tourism Investors Summit) నిర్వహించనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం (AP Secretariat)లో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దుర్గేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడ వివంత హోటల్‌లో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్ చర్చకు వచ్చింది. దీంతో ఆ సమ్మిట్‌లో వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరగా వాటిని పట్టాలెక్కించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Visakha: ఏపీపై వరాల జల్లు.. రేపే అవి ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
అలాగే పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రగతిపైనా మంత్రి సమీక్షించారు. పనులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. త్వరలోనే ఆయా పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని, తానే స్వయంగా పర్యాటకాభివృద్ధి పనులు పర్యవేక్షిస్తానని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విశేష ప్రాచుర్యం కల్పించాలని మంత్రి ఆదేశించారు.
ACB RAIDS: ఫార్ములా ఈ కార్ రేస్.. ఏపీలో సోదాలు
ఏపీలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే పెద్దఎత్తున వాటిని సందర్శించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. తద్వారా పర్యాటకశాఖకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అలాగే ప్రజలకు కూడా మన చరిత్ర గురించే తెలిసే అవకాశం ఉంటుందని దుర్గేశ్ చెప్పుకొచ్చారు. అనంతరం మంత్రి దుర్గేశ్‌తో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురూ సినిమాటోగ్రఫీ శాఖపై విస్తృతంగా చర్చించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Andhra Pradesh: దారుణం.. ప్రియురాలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి మరీ..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. సుప్రీం కీలక తీర్పు