AP High Court : ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ జరపాలా? వద్దా?
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:47 AM
చిలకలూరిపేట పట్టణ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో

డీఎస్పీ అనుమతి అవసరమా? కాదా?
మాజీ మంత్రి విడదల రజని పిటిషన్‌పై పోలీసుల తరఫు న్యాయవాదికి హైకోర్టు ప్రశ్నలు
కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట పట్టణ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌ను కోర్టు ఆదేశించింది. నేర తీవ్రత ఉన్న(కాగ్నిజబుల్) కేసులలో బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 173(3) ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు ప్రాధమిక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించింది. దర్యాప్తుపై డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరా? నిబంధనలు అనుసరించకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? తదితర వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గం టీడీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిల్లి కోటి ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ల కింద చిలకలూరిపేట పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రజని, ఆమె పీఏలు నాగశెట్టి జయ ఫణీంద్ర, రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత పిటిషనర్లపై కేసు పెట్టారన్నారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని సూచించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ... కాగ్నిజబుల్ కేసులలో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరికాదని వివరించారు.