Share News

AP High Court : జగన్‌ పాస్‌పోర్టుకు హైకోర్టు ఎన్‌వోసీ

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:21 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఆయనకు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది.

AP High Court : జగన్‌ పాస్‌పోర్టుకు హైకోర్టు ఎన్‌వోసీ

  • కుమార్తె స్నాతకోత్సవానికి బ్రిటన్‌ వెళ్లేందుకు అనుమతి

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హైకోర్టులో ఉపశమనం లభించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఆయనకు పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టు పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది. ఆయన తాజాగా పాస్‌పోర్టు పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని(ఎన్‌వోసీ) జారీ చేసింది. యూకేలో ఈ నెల 16న జరగనున్న కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. పాస్‌పోర్టు జారీ విషయంలో స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయని, తమముందు హాజరై రూ.20వేల స్వీయ పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ.. ఎన్‌వోసీ కోసం జగన్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు (ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే న్యాయస్థానం) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.

Updated Date - Jan 08 , 2025 | 03:22 AM