Share News

Pithapuram : జనసేన ప్లీనరీకి స్థలాల పరిశీలన

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:45 AM

ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు.

Pithapuram : జనసేన ప్లీనరీకి స్థలాల పరిశీలన

పిఠాపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మార్చిలో పార్టీ ప్లీనరీ నిర్వహణకు జనసేన సమాయత్తమవుతోంది. దీనికోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు కసరత్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు, గొల్లప్రోలు బైపాస్‌రోడ్డు, పిఠాపురం పట్టణ శివారులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనుగోలు చేసిన స్థలంతో పాటు పిఠాపురం మండలం చిత్రాడ సమీపంలోని ఎస్‌బీ వెంచర్స్‌ లేఅవుట్‌ స్థలాలను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్సీ హరిప్రసాద్‌, కల్యాణం శివశ్రీనివాస్‌, పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, ఇతర నాయకులు సందర్శించారు. మార్చి 12, 13, 14 తేదీల్లో నిర్వహించే ప్లీనరీకి రాష్ట్రం నుంచే గాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహణ, సౌకర్యాల కల్పనకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. చిత్రాడ శివారులోని లేఅవుట్‌ స్థలం అనువుగా ఉంటుందని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినా.. పవన్‌ అభిప్రాయాన్ని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - Jan 06 , 2025 | 04:45 AM