Pawan Kumar Investigation: పోలీసుల ముందు అవినాష్ అనుచరుడు
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:06 PM
Pawan Kumar Investigation: ఎంపీ అవినాష్ అనుచరుడు పవన్ కుమారుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కడప, మార్చి 26: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP YS Avinash Reddy) అనుచరుడు పవన్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈరోజు (బుధవారం) ఉదయం పులివెందుల పోలీసుల ఎదుట పవన్ విచారణకు హాజరయ్యారు. వైఎస్ అవినాష్ యూత్ వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న పవన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) నిందితుడైన సునీల్ యాదవ్ (Sunil Yadav) ఫిర్యాదుతో పవన్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు పిలిపించారు. ఇటీవల విడుదలైన హత్య సినిమాలోని సీన్‌లను అవినాష్ యూత్ వాట్సప్ గ్రూప్‌లో పదే పదే వైరల్ చేస్తున్నారని సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు.
వైఎస్ వివేక హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ ఫిర్యాదు మేరకు పవన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన హత్య సినిమాలో తనను, తన తల్లిని క్రూరంగా చూపించారని, లేనివి ఉన్నట్లుగా సన్నివేశాలు చూపించారని.. అదే సన్నివేశాలను అవినాష్ అనుచరుడు పవన్... అవినాష్ యూత్ వాట్సప్ గ్రూప్‌లో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అవినాష్ రెడ్డి గ్రూప్‌లో తనను, తన కుటుంబాన్ని పదే పదే అవమానిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి పులివెందుల పోలీసులు విచారణ జరిపారు.
Pastors Death Controversy: పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు సీఎం ఆదేశం..
అయితే ఈరోజు విచారణకు రావాల్సిందిగా పవన్‌కు నిన్న(మంగళవారం) పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పవన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే వివేకా కేసుకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పులివెందుల డీఎస్పీతో పాటు సిట్ సభ్యుడు సింహాద్రిపురం ఎస్సై కూడా పవన్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ కుమార్, అతడి కుటుంబంపై హత్య సినిమా సీన్‌లను వైరల్ చేసింది నిజమని తేలితే పవన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu Directives to Police: బెట్టింగ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్.. నూతన చట్టానికి ప్లాన్..
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Read Latest AP News And Telugu News