Remand: పోసాని కృష్ణ మురళీకి రిమాండ్..
ABN , Publish Date - Feb 28 , 2025 | 07:17 AM
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీకి రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అతనికి నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అన్నమయ్యజిల్లా: రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali)కి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు (Court) 14 రోజుల రిమాండ్ (14 days Remand) విధించింది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె పోలీస్టేషన్‌కు తరలించారు. 8 గంటల విచారించిన పోలీసులు పోసానికి వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. కాగా పోసానికి రిమాండ్ విధించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్ పోసానికి 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో పోసానిని కడప కేంద్రకారాగానికి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ వార్త కూడా చదవండి..
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ, జనసేన అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసాని కృష్ణ మురళీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మైహోం భూజా అపార్టుమెంట్లో ఉన్న అతనికి పోలీసులు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యాయి. పోసానిపై ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు.
రంగంలోకి అన్నమయ్య జిల్లా పోలీసులు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఈనెల 24వ తేదీన మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 196, 353 (2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు (క్రైమ్ నంబర్ 65/2025) నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్.. మాట్లాడేందుకు సిగ్గుండాలి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News