Harassment : ‘కోనసీమ మోనాలిసా’ అంటూ బాలికపై పోస్టింగ్
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:46 AM
కుంభమేళాలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి.. మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయిపోయింది.

యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
ముమ్మిడివరం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కుంభమేళాలో పూసలు అమ్మే మహిళను వీడియో తీసి.. మోనాలిసా అంటూ ప్రచారం చేయడంతో ఆమె పాపులర్ అయిపోయింది. ఆ ప్రభావంతోనేమో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో ఆదివారం జరిగిన సత్తెమ్మతల్లి తీర్థంలో పూసలు అమ్ముకుంటున్న బాలికను సత్తి దేవిశ్రీప్రసాద్ అనే యువకుడు వీడియోతీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘కోనసీమ మోనాలిసా’ అంటూ పోస్టింగ్ పెట్టాడు. ఈ పోస్టింగ్‌కు లక్షల్లో లైకులు వచ్చినా.. పదో తరగతి చదువుతున్న ఆమెను సహ విద్యార్థినులు ఎగతాళి చేయడంతో మనస్తాపానికి గురైంది. దీంతో ఆ బాలిక పినతల్లి ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదు చేశారు.