Share News

AP Cabinet: ఏపీ కేబినెట్‌‌లో చర్చించే అంశాలు ఇవే..

ABN , Publish Date - Jan 02 , 2025 | 10:38 AM

Andhrapradesh: అమరావతిలో రూ.2700 కోట్ల విలువ కల రెండు ఇంజరీనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపీ ఎంఆర్‌యూడీఏ చట్టం 2016లో భవనాల లే అవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

AP Cabinet: ఏపీ కేబినెట్‌‌లో చర్చించే అంశాలు ఇవే..
AP Cabinet meeting

అమరావతి, జనవరి 2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu naidu) అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం (APm Cabinet Meeting) కాసేపట్లో ప్రారంభంకానుంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఎజెండాగా ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యంగా 14 అంశాలు ఎజెండాగా ఈరోజు మంత్రి మండలి సమావేశం జరుగనుంది. అమరావతిలో రూ.2700 కోట్ల విలువ కల రెండు ఇంజరీనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్‌లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపీ ఎంఆర్‌యూడీఏ చట్టం 2016లో భవనాల లే అవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలిలో ఆమోదముద్ర పడనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా, పత్తిపాడు మండలం, నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ పచ్చజెండా ఊపనుంది


వీటితో పాటు ఎజెండా పూర్తయ్యాక సీఎం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టు బనకచర్ల ఇంట్రాకనెక్ట్ ఆఫ్ రివర్స్ పైన కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన ఆరు నెలల పాలన.. రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫామెన్స్ రిపోర్టులను ముఖ్యమంత్రి తీసుకున్నారు. వీటి పైన, తన వద్ద ఉన్న రిపోర్టుల వివరాలతో కలిపి కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఈ పెట్టుబడుల వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే


నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి అమోదం తెల‌ప‌నుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడుల‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెల‌ుప‌నుంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ‌ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడుల‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు మంత్రిమండలి ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..

CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2025 | 10:38 AM