CM Chandrababu: జలవనరుల శాఖపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:38 PM
Andhrapradesh: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం వలన వచ్చిన నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారుల కృషి వలన 85 శాతం రిజర్వాయర్లు నిండాయన్నారు. రిజర్వాయర్లలో 75 శాతం నీటి నిల్వలు ఇంకా ఉన్నాయని తెలిపారు.
అమరావతి, జనవరి 2: ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం అనంతరం మంత్రులతో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చర్చించారు. పలు రాజకీయ, తాజా అంశాలపై చర్చ నిర్వహించారు. ఇందులో భాగంగా జలవనరుల శాఖపై సీఎం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం వలన వచ్చిన నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu), అధికారుల కృషి వలన 85 శాతం రిజర్వాయర్లు నిండాయన్నారు. రిజర్వాయర్లలో 75 శాతం నీటి నిల్వలు ఇంకా ఉన్నాయని తెలిపారు. మంత్రి, అధికారులు దృష్టి పెడితే ఫలితాలు బాగుంటాయని అనే దానికి ఇదే ఉదాహరణ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 85 శాతం రిజర్వాయర్లు నింపామని సీఎం అన్నారు. అలాగే రాష్ట్రంలో డీఎస్సీ పోస్టుల భర్తీ.. వచ్చే విద్యాసంవత్సరంలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే మత్స్య కారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విద్యాసంస్థల యాజమాన్యాలతో మాట్లాడి కొత్త విద్యాసంవత్సరం ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ చెల్లింపులు చేయాలన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇప్పటికే అమల్లోకి తెచ్చిన ఫించన్ పెంపు, దీపం పథకం వంటి వాటిపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. మరోవైపు ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లింపు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20 వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Telangana Government: మరో శుభవార్త చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..
అలాగే మంత్రులందరికీ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్‌కు సీఎం అభినందనలు తెలిపారు. తొలిసారి ఓ బీసీ అధికారికి సీఎస్ పదవి దక్కడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎస్సీ అధికారి కాకి మాధవరావుకు సీఎస్‌గా నియమించింది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..
CM Chandrababu: మోయలేనన్ని పాపాలు!
Read Latest AP News And Telugu News