Share News

CM Chandrababu: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే

ABN , Publish Date - Jan 01 , 2025 | 01:08 PM

Andhrapradesh: విజయవాడ కనకదుర్గమ్మ సేవలో తరించారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు వారికి, భారతీయులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. ప్రజల దర్శనం చేసుకున్నాక, దుర్గమ్మ దర్శనం చేసుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే
AP CM Chandrababu Naidu

విజయవాడ, జనవరి 1: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu naidu) బుధవారం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి.. వేద పండితుల వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు. దర్శనానంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... తెలుగు వారికి, భారతీయులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల దర్శనం చేసుకున్నాక, దుర్గమ్మ దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఏపీ‌ ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లని చూపు మనకి ఉందన్నారు. అందరికీ ఆదాయం పెరిగి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ శుభం జరుగాలని, మంచి‌ జరగాలని దుర్గమ్మను ప్రార్ధించానన్నారు. చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్పూర్తి ఉందన్నారు. వారి చూసిన తర్వాతే తనకు నమ్మకం వచ్చిందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని.. అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మను ప్రార్థించినట్లు తెలిపారు.


ఈ ఏడాది నుంచి తెలుగు వారికి అన్నీ జయాలే ఉండాలని మనస్పూర్తికి ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలుగు వారికి మంచి జరగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్తు మన తెలుగు వాళ్లదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దుర్గమ్మ ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును హోం మంత్రి వంగలపూడి అనిత, బుద్దా వెంకన్న , గద్దె అనురాధ కలిశారు. తెలుగు వారికి మంచి జరగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. భవిష్యత్తు మన తెలుగు వాళ్లదే, త్వరలోనే మరింత మంచిని చూస్తారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దుర్గమ్మ ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును హోం మంత్రి వంగలపూడి అనిత, బుద్దా వెంకన్న , గద్దె అనురాధ కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గగుడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


టీటీడీ అర్చకుల ఆశీర్వాదం

chandrababu-ttd.jpg

అలాగే... నూతన సంవత్సరం సందర్భంగా టీటీడీ అర్చకుల ఆశీర్వాదం పొందారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎంకు టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.అనంతరం శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ క్యాలెండర్, డైరీ, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ ఈవో అందజేశారు.

ఇవి కూడా చదవండి..

ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 01 , 2025 | 01:39 PM