Share News

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

ABN , Publish Date - Jan 26 , 2025 | 11:59 AM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ ఆంధ్ర రత్న భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారని, పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌ను అవమానించారని ఆమె విమర్శించారు.

Republic Day.. బీజేపీకి  రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

విజయవాడ: ఆంధ్ర రత్న భవన్‌ (Andhra Ratna Bhavan)లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) జరిగాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) జాతీయ జెండాను (National Flag) ఎగరవేశారు. ఈ సందర్బంగా ఆమె రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మనకున్న ఈ హక్కులు అన్ని మన రాజ్యాంగం కల్పించినవేనని.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదని విమర్శించారు. స్వాతంత్య్ర పౌరులను సయితం అవమానిస్తోందని, అంబేద్కర్‌ను హేళన చేస్తోందని, మహాత్మ గాంధీని విలన్‌గా చూపిస్తున్నారని, మహాత్మను చంపిన గాడ్సేకి గుడులు కడుతున్నారని దుయ్యబట్టారు. మతం,కులం పేరుతో బీజేపీ నేతలు కలహాలు రేపుతున్నారని, దేశ సంపదను ప్రధాని మోదీ దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ఈ వార్త కూడా చదవండి..

నాలుగు పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..


బాబుది తెరముందు పొత్తు.. జగన్ ది తెరవెనుక పొత్తు..

ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుర్వినియోగం చేస్తున్నారని, పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌ను అవమానించారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఏపిలో ఉన్న రెండు పెద్ద పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్‌టీపీలు బీజేపీతో జత కట్టాయని, బీజేపీ చేస్తున్న అన్యాయానికి వత్తాసు పలుకుతున్నాయని దుయ్యబట్టారు. విభజన హామీలపై బీజేపీ మోసం చేసినా.. ఆ రెండు పార్టీలు పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుది తెరముందు పొత్తు అయితే.. మాజీ సీఎం జగన్‌ది తెరవెనుక పొత్తు అని అన్నారు.


జగన్ బీజేపీకి గులాం గిరీ

జగన్ బీజేపీకి గులాం గిరీ చేశారని, వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్సార్‌సీపీకి దళితులు ఓట్లు వేసి గెలిపిస్తే వారి పట్ల కృతజ్ఞత భావం లేదన్నారు. బీజేపీ దళితులను అవమనిస్తుంటే కనీసం చిన్న ఖండన కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంబేద్కర్‌ను అవమానిస్తే వైఎస్సార్‌సీపీ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాలు పెడితే గౌరవం ఉన్నట్లు కాదని.. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్‌కు అవమానం జరిగితే జగన్ మౌనం వహించారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అంబేద్కర్‌ను అవమానిస్తే ఆ రెండు పార్టీలకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.

బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది

బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చుతుందని, అలాగే రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ ఈ దేశ సంపదను అదానీకి కట్ట బెడుతోందని, ఇంకా అధికారంలో ఉంటే మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆరోపించారు. ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనని వైఎస్ షర్మిల అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో త్రివర్ణ పతాకం ఎగరవేత..

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో పరేడ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 26 , 2025 | 11:59 AM