Legislative Council Controversy: మమ్మల్ని అవమానిస్తున్నారన్న బొత్స.. మంత్రుల సమాధానం ఇదీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 03:35 PM
Legislative Council Controversy: ఫొటో సెషన్‌కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదని... తనతో పాటు మండలి ఛైర్మన్‌ను కూడా చిన్నచూపు చూశారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి, మార్చి 19: శాసనమండలిని, మండలి సభ్యులను చిన్నచూపు చూస్తున్నారంటూ మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న (మంగళవారం) స్పోర్ట్స్ మీట్, ఫొటోసెషన్ సందర్భంగా చైర్మన్ సహా సభ్యులను అవమానించారన్నారు. స్పోర్ట్స్ మీట్ వేదిక, ద్వారాల వద్ద మండలి ఛైర్మన్ ఫొటోలు లేవని.. మండలి ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కించపరుస్తూ, అవమానిస్తున్నారని బొత్స అన్నారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫొటో సెషన్‌కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదన్నారు విపక్ష నేత. తనతో పాటు మండలి ఛైర్మన్‌ను కూడా చిన్నచూపు చూశారన్నారు. ఫోటో సెషన్ వద్ద ప్రొటోకాల్ చూస్తోన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వల్ల శాసనమండలికి, సభ్యులకు అగౌరవం వచ్చేలా ఉందన్నారు.
మండలిని, ఛైర్మన్‌ను అవమానిస్తున్నారన్న బొత్స వ్యాఖ్యలపై సభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సమాధానం ఇచ్చారు. భారత రాజ్యాగం ప్రకారం అత్యున్నతస్థానంలో ఉన్న ఛైర్మన్ పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు లేదని స్పష్టం చేశారు. మండలి ఛైర్మన్‌పై సీఎం చంద్రబాబుకు(CM Chandrababu), మంత్రులు, సభ్యులకు తేలిక భావన ఎప్పుడూ లేదన్నారు. మండలి ఛైర్మన్ రాకపోతే సీఎం, ఉప ముఖ్యమంత్రి మండుటెండలో 10 నిముషాల సేపు నిలబడ్డారని చెప్పుకొచ్చారు.
సీఎం వేచి చూసి మండలి ఛైర్మన్ వచ్చాకే ఫొటో సెషన్‌ను ప్రారంభించారని తెలిపారు. సభ పట్ల, సభాపతి పట్ల సీఎం ఇచ్చే గౌరవానికి నిన్నటి ఘటన నిదర్శనమన్నారు. సాంప్రదాయాలను పాటించాలని సీఎం చంద్రబాబు అందరికీ సూచించారన్నారు. నిన్న ప్రొటోకాల్ పరంగా ఏం జరిగిందనేది విచారణ చేస్తామని.. సభను, సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాట్లాడటం సరైంది కాదని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Chandrababu Naidu: బిల్‌గేట్స్‌తో ముగిసిన చంద్రబాబు భేటీ
మాకు చిన్న చూపు లేదు: మంత్రి లోకేష్
మండలి సభ్యులను ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలి సహా ఛైర్మన్ అంటే తమకు అపార గౌరవం ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేయడాన్ని అధికారులు మరచిపోయారని.. తాము చెబితే అధికారులు కుర్చీ వేయడంతో వారు ఫొటో దిగారన్నారు. జరిగిన ఘటనపై సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Marri Rajasekhar Resigns: మర్రి రాజశేఖర్‌కు బుజ్జగింపులు.. ఇదే ఫైనల్ అన్న ఎమ్మెల్సీ
Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి
Read Latest AP News And Telugu News