Share News

Central Govt: సీఎం లేఖ.. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:01 PM

Central Govt: ఏపీలో మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ఎక్కువ సాయం అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

Central Govt: సీఎం లేఖ.. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం
Central Govt Chilli farmer Issue

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: మిర్చి రైతుల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) విజ్ఞప్తికి కేంద్రం (Central Govt) ఓకే చెప్పింది. మిర్చి ఎగుమతులను పెంచేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Union Agriculture Minister Shivraj Singh Chouhan) పరిశీలిస్తున్నారు. మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద ఏపీలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. పథకం కింద వీలైనంత ఎక్కువ సాయం చేసే ప్రతిపాదనను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. చంద్రబాబు నాయుడు విజ్ఞప్తితో తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను నిన్న (గురువారం) శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలతోనూ సమన్వయం చేసుకుని పరిష్కారం కనుగొనాలని చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.


రామ్మోహన్ నాయుడు భేటీ

ఏపీ సీఎం విజ్ఞప్తి, శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలతో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రంగంలోకి దిగారు. ఏపీ మిర్చి రైతులకు చేయూత విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఉన్నతాధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఐవీఎఫ్ కేంద్రం పొరపాటు.. పుట్టిన బిడ్డను చూశాక తల్లికి షాక్!


ఆ సమస్యలపైనే బాబు ఫోకస్..

నిన్నటి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపై చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారు. ఏపీ మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు చంద్రబాబు కీలక ప్రతిపాదనలు ఉంచారు. మార్కెట్ జోక్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు సీలింగ్ తొలగించి సాధ్యమైనంత ఎక్కువ పంట కొనుగోలు చేయాలని ఏపీ సీఎం వినతి చేశారు. ఐసీఏఆర్ నిర్ణయించిన మిర్చి ధరలు ఏపీ రైతుల సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఖరారు చేసినట్లు కనిపిస్తోందని... వాటిని సరిదిద్దాలన్నారు చంద్రబాబు. మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో ఆలోచన చేయాలని ఆయన తెలిపారు. మిర్చి ఎగుమతులను స్థిరీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. బాబు విజ్ఞప్తితో తక్షణ చర్యలు, పరిష్కార మార్గం కనుక్కోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

తాజ్‌ బంజారా హోటల్‌‌కు షాక్

Phone Tapping Case: ఫోన్‌ట్యాపింగ్ కేసు.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 01:11 PM