Share News

Chandrababu on vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు రియాక్షన్..

ABN , Publish Date - Jan 25 , 2025 | 03:03 PM

CM Chandrababu: విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘అది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.. ఇంతకంటే ఏమీ కామెంట్ చేయను’’ అంటూ చంద్రబాబు అన్నారు.

Chandrababu on vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు రియాక్షన్..
CM Chandrababu

అమరావతి, జనవరి 25: వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజకీయాలకు (Politics) గుడ్‌బై చెప్పేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈరోజు ఉదయం వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయి రాజీనామా చేశారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్‌ను కలిసి రాజీనామ పత్రాన్ని కూడా అందజేశారు. ఇదిలా ఉండగా.. విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయి రాజీనామా అనేది వాళ్ల పార్టీ అంతర్గత సమస్య అని అన్నారు. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ‘‘నేను అంతకుమించి ఆ విషయం పై కామెంట్ చేయను’’ అని స్పష్టం చేశారు.


సింగపూర్ వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వం విధ్వంసం చూపించిందని.. అందువలనే వాళ్ళు రావడానికి విముఖత చూపించారని తెలిపారు. ఏపీ అంటే గ్లోబల్‌గా అసహ్యం వేసే పరిస్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు వస్తే ఇటువంటి పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు.


రేవంత్ వ్యాఖ్యలపై..

ఏపీకి హైదరాబాద్ లేదు అని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై స్పందించిన సీఎం.. ‘‘నేను హైదరాబాద్‌ను తెలుగు కమ్యూనిటీ కోసం డెవలప్ చేశాను.. దానిని ఎవరూ ఎలా చెప్పుకున్నా పర్వాలేదు’’ అని తెలిపారు.. జిందాల్ కూడా దావోస్ వచ్చారని... కడప స్టీల్ గురించి స్టార్ట్ చేయమని చెప్పినట్లు తెలిపారు. 95 వేల కోట్లు రూపాయలతో బీపీసీఎల్ రిఫైనరీ ఏపీలో స్టార్ట్ కాబోతుందన్నారు. ఆరునెలల్లో డీఆర్పీ రెడీ అవుతుందన్నారు. దేనికోసం దావోస్ వెళ్లి ఎంవోయూ ఎందుకు చేసుకోవాలని... అవసరం లేదుగా..ఎంవోయూలు చేసుకుంటేనే పరిశ్రమలు వచ్చినట్లు కాదన్నారు. మనం చేసే నెట్వర్క్ వలన భవిష్యత్‌లో పరిశ్రమలు వస్తాయని చెప్పుకొచ్చారు.


హైదరాబాద్‌ను గతంలో అలానే డెవలప్ చేశానని.. అక్కడే తన తరువాత వచ్చిన వాళ్ళు హైటెక్ సిటీని ఎవరూ కూల్చలేదన్నారు. ఏపీలో ప్రజలు వచ్చి తనను కలిసే ప్రజా వేదికను కూల్చేశారని... ఆ తరువాత కూడా విధ్వంసం జరిగిందన్నారు. వ్యవస్థలు కూడా విధ్వంసం జరిగాయన్నారు. రాజధాని లేకుండా చేసి మూడు ముక్కలు ఆట ఆడారని మండిపడ్డారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలు కూడా తగ్గిపోయాయని తెలిపారు. వారికి ఇచ్చే రాయితీలు కూడా జగన్ ఆపారన్నారు. మళ్ళీ వీటన్నిటినీ సరిదిద్దుతున్నానని... మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నానని చెప్పారు. అందువలనే మనం ముందు వీటిపై దృష్టి పెట్టాలి.. వీటితో పాటు పరిశ్రమలు కూడా తెచ్చుకోవాలన్నారు. మన ఫ్రెండ్ షిప్, మన నెట్వర్క్ తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రేపు భారత మాతకు మహాహారతి

TDP on Vijayasai: విజయసాయి రాజకీయ సన్యాసంపై టీడీపీ ఫస్ట్‌ రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 03:08 PM