CM Chandrababu: ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు
ABN , Publish Date - Mar 01 , 2025 | 11:12 AM
CM Chandrababu: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం. ఈ సందర్భంగా ఆశావర్కర్లపై వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి.

అమరావతి, మార్చి 1: ఆశా వర్కర్లపై (Asha Workers) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వరాలు కురిపించారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిర్ణయించారు సీఎం. ఇందులో భాగంగా ఆశా వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించనున్నారు.
Posani Krishna Murali: అది సజ్జల స్క్రిప్ట్.. పోలీసులతో పోసాని
ప్రస్తుతం ఆశావర్కర్లు నెలకు రూ.10,000/- వేతనం పొందుతున్నారు. వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందే అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు ఉన్నారు. త్వరలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్లు జారీ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
Vision 2047: పండంటి ప్రగతికి 10 సూత్రాలు!’
Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Read Latest AP News And Telugu News