Share News

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:52 AM

43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో... సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...
CM Chandrababu Comments

అమరావతి: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని (TDP 43rd Fundation Day) పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (AP TDP Chief Palla Srinivas) నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ అని, ‘అన్న’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో... సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణమేనని సీఎం చంద్రబాబు అన్నారు. పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు.

Also Read..: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా...

తెలుగు వారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా...

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా...

తెలుగు వారికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఇచ్చిన జెండా...

ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా..

రైతన్నల కన్నీరు తుడిచి, వెన్నంటే ఉన్న జెండా...

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన జెండా...

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా. ..

భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా... మన పసుపు జెండా... అని, దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని చంద్రబాబు పేర్కొస్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు.. ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని, ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కోటికి పైగా సభ్యత్వాలతో అసాధారణ రికార్డును సృష్టించి.. తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న మన తెలుగు దేశం జెండాకు, ఆ జెండా మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. చారిత్రాత్మక దినమైన నేటి రోజున...ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నానని.. ‘జై తెలుగుదేశం...జోహార్ ఎన్టీఆర్’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇలా చేస్తే కూలర్ క్షణాల్లో పని చేస్తుంది..

ఉగాది పచ్చడి వెనుక రహస్యం ఇదే..

ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం..

For More AP News and Telugu News

Updated Date - Mar 29 , 2025 | 11:55 AM